హాస్యనటులు హీరోలుగా మారడం, సినిమాటోగ్రాఫర్లు దర్శకులుగా మారటం కామన్. ఒక్కప్పుడు రైటర్ గా పని చేసిన కొరటాల శివ ఇప్పడు దర్శకుడిగా సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఒకప్పుడు సినిమాటోగ్రాఫర్ గా ఉన్న కార్తీక్ ఘట్టమేని దర్శకుడిగా మారాడు. అలాగే హీరోలు సైతం దర్శకులుగా సినిమాలు చేసిన వాళ్ళు చాల మంది ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, కృష్ణ నటిస్తూ దర్శకులుగా సినిమాలు చేసారు. ఇప్పటి యంగ్ హీరోలలో వవిశ్వక్ సేన్ ఒకవైపు హీరోగా చేస్తూ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.
Also Read : PrashanthNeel : ‘బఘీర’ ట్రైలర్ రిలీజ్.. మరో సలార్
తాజాగా మరొక స్టార్ హీరో కూడా దర్శకుడిగా మారుతున్నాడు. అతడెవరో కాదు జయం రవి. తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించిన జయం రవి దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. అందుకు సంబంధించి ఇప్పటికి అన్ని చర్చలు ముగిశాయని తెలుస్తోంది. అయితే జయం రవి దర్శకత్వం చేయబోయే సినిమాలో హీరోగా తమిళ ప్రముఖ హాస్య నటుడు యోగి బాబు నటించనున్నాడు. గతంలో తన సినిమాలలో నటించిన యోగిబాబుతోనే దర్శకుడిగా తన తోలి ప్రయత్నం చేస్తున్నాడు జయం రవి. యోగిబాబు హీరోగా ఇప్పటికె మండేలా, కోకోకోకిలా, బోట్ వంటి సినిమాలు వచ్చాయి. ఇటీవల వైవాహిక జీవితానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్న జయం రవి దర్శకుడిగా కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే దర్శకత్వం చేయబోతున్నాడు. అన్నట్టు జయం రవి అన్న మోహన రాజా ప్రముఖ దర్శకుడు, తమిళ్ లో తని ఒరువన్, తెలుగులో గాడ్ ఫాదర్ వంటి చిత్రాలకు మోహన్ రాజా దర్శకుడు