రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం “కల్కి 2898 ఎడి”. కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ఇంకా దీపికా పడుకోణ్ అత్యంత కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకు వెళ్తూ రికార్డులమీద రికార్డులు నమోదు చేస్తూ గత చిత్రాలు తాలుకు రికార్డులను బద్దలుకొడుతుంది.
కాగా వరల్డ్ బాక్సాఫీస్ వద్ద కల్కి జోష్ ఇంకా తగ్గలేదు. విడుదల నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో నాలుగు వారాలు కంప్లిట్ చేసుకుని విజయవంతంగా ఐదవ వారంలోకి అడుగు పెట్టాడు కల్కి. ఐదవ వారంలోను అదరగొడుతుంది ఈ సినిమా. వర్కింగ్ డేస్ అయిన సోమ, మంగళవారాల్లోనూ బుక్ మై షోలో 19K టికెట్స్ బుక్ అయ్యాయంటే అర్ధం చేసుకోవచ్చు కల్కి మానియా ఎలా ఉందొ. ఆగస్టు 15వరకు కల్కి సినిమాకు లాంగ్ రన్ ఉండనుంది. ఈ లోపు కొన్ని సినిమాలు విడుదలైన అవన్నీ మిడ్ రేంజ్ సినిమాలే. దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రు.372కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం 1100 కోట్ల రూపాయల కలెక్షన్లు దాటి 1150 కోట్ల వైపు పరుగులు పెడుతుంది.దాదాపు అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతకు రూ.160 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది. నేపాల్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి -2 ని రూ.23 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి కల్కి సరికొత్త రికార్డు నమోదు చేసింది.
Also Read: Dhanush: ధనుష్ ‘రాయన్’ సరికొత్త రికార్డులు నమోదు చేసెన్..