ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ హాస్యనటులు జాబితాలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఈ హాస్యనటుడు దర్శకుడిగా మారబోతున్నాడట. కిషోర్ గతంలో “వెన్నెల 1 1/2” అనే కామెడీ ఎంటర్టైనర్ కోసం మెగాఫోన్‌ను పట్టుకున్నాడు. ఈ చిత్రానికి అంతగా ఆదరణ అయితే రాలేదు కానీ కిషోర్ దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వెన్నెల కిషోర్ మెగాఫోన్‌ను పట్టబోతున్నాడట. కానీ ఈసారి సినిమాకు కాదు వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహిస్తాడట.
Read Also : విజయ్ సెట్లో ఉన్న స్టార్ హీరోని గుర్తుపట్టలేదట !
పాపులర్ తెలుగు ఓటిటి వేదిక “ఆహా” ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించాలని యోచిస్తోంది. దానికి దర్శకత్వం వహించాలని వారు వెన్నెల కిషోర్‌ను కోరారు. ఈ సిరీస్‌లో ఆయన కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అతను స్క్రిప్ట్‌ను అతి త్వరలో లాక్ చేస్తాడు. ప్రాజెక్ట్ తదనుగుణంగా కార్యరూపం దాల్చుతుంది. వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి. కిషోర్ తన రెండవ ప్రాజెక్ట్ కు దర్శకత్వం వహించడంలో విజయవంతమవుతాడో లేదో చూడాలి. కాగా ఇటీవలే మరో ప్రముఖ కమెడియన్ హర్షవర్ధన్ ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. అందులో హీరోగా సుధీర్ బాబు నటిస్తున్నాడు.