బిగ్ బాస్ సీజన్ 6లో నామినేషన్స్ సంఖ్య వారం వారానికీ పెరిగిపోతున్నాయి. ఇరవై మంది కంటెస్ట్స్ ఉన్న మొదటి వారం ఏడు మందిని నామినేట్ చేసిన బిగ్ బాస్… ఫస్ట్ వీకెండ్ లో ఎవరినీ బయటకు పంపలేదు. దాంతో రెండో వారం ఎనిమిది మందిని ఎలిమినేషన్ నిమిత్తం నామినేట్ చేశాడు. అందులోంచి సెకండ్ వీకెండ్ లో షానీ, అభినయశ్రీ ఎలిమినేట్ అయిపోయి, హౌస్ నుండి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న 18 మంది కంటెస్టెంట్స్ లోనూ ఏకంగా తొమ్మిది మందిని ఈవారం నామినేషన్స్ లో ఉంచాడు. ఈ వీక్ ఒక్కో ఇంటి సభ్యుడికి ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం బిగ్ బాస్ కల్పించాడు. దాంతో అత్యధికంగా ఆరోహి, రేవంత్ లను ఐదుగురేసి సభ్యులు నామినేట్ చేశారు. ఆ తర్వాత స్థానంలో నాలుగేసి ఓట్లతో ఆదిత్య, గీతూ నిలిచారు. మూడు ఓట్లతో ఇనయా రెహ్మాన్, రెండేసి ఓట్లతో వాసంతి, చంటి, శ్రీహాన్ ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో ఉన్నారు. మిగిలిన వారు ఒక్క ఓటుతో బాచాయించారు.
చిత్రం ఏమంటే… ఈవారం నామినేషన్స్ ప్రక్రియ కవ్వింపులు కేకలతో జోర్దార్ గా సాగింది. ఒకరిపై ఒకరు అవసరానికి మించి అరుచుకుంటూ రెచ్చిపోయారు. నాగార్జున గేమ్ విషయంలో అలెర్ట్ గా ఉండమని, టేక్ ఇట్ గ్రాంట్ గా తీసుకోవద్దని క్లాస్ పీకిన నేపథ్యంలో సోమవారం ప్రసారమైన ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరూ రెట్టించిన ఉత్సాహంతో గట్టిగానే వాదోపవాదాలకు దిగారు. కొందరు సహనం చచ్చిపోయి మౌనం వహించగా, ఇంకొందరు వాదించి ఉపయోగం లేదని గ్రహించి మౌనం పాటించారు. ఇక ఈ వారం వీక్షకులను ఓటు వేయమని అభ్యర్తించాల్సిన పరిస్థితి రేవంత్, ఆరోహి, గీతూ, ఆదిత్య, ఇనయా, వాసంతి, చలాకి చంటీ, నేహా, శ్రీహాన్ లకు దక్కింది.
GHMC Councel Meeting: ఉదయం 10 గంటలకు GHMC కౌన్సిల్ మీటింగ్.. సర్వత్రా ఆసక్తి