తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ‘యుఫోరియా’ పేరుతో ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ విజయవాడలో మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మ్యూజికల్ నైట్ జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రి లోకేష్ ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్టీఆర్ 'యూఫోరియా మ్యూజికల్ నైట్ ఈవెంట్' లో సందడి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ#EuphoriaMusicalNight #NTR #Thaman #ChandrababuNaidu #PawanKalyan #NandamuriBalakrishna #NTVTelugu pic.twitter.com/nvSvYSpJ13
— NTV Telugu (@NtvTeluguLive) February 15, 2025