Nayanthara: తమిళ చిత్రపరిశ్రమలో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నటి నయనతార. ఇటీవల ప్రియుడు విఘ్నేష్ శివన్ ని పెళ్ళి చేసుకుని ఓ ఇంటిదైన నయన్ క్రేజ్ ఇంకా పెరిగింది. అందుకు తాజా ఉదాహరణ తన పారితోషికం. బాలీవుడ్ తారలు దీపికా పదుకొనె, అలియా భట్ కు దీటుగా దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే నటి నయన్ అని నిరూపితం అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వంలో తీయబోయే సినిమా కోసం నయనతారతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ చిత్రం కోసమే నయనతార 10 కోట్ల పారితోషికం అందుకోనుందట. దీపికా, అలియా ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు నయన్ వారిని మించి పారితోషికం తీసుకోనుండటం విశేషమనే చెప్పాలి. మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’తో పాటు ‘ప్రేమమ్’ దర్శకుడి తదుపరి చిత్రం ‘గోల్డ్’ వంటి కమర్షియల్ ప్రాజెక్ట్స్ కోసం నయన్ 4 నుంచి 5 కోట్ల వరకు తీసుకుంటోంది.
అయితే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయితే మాత్రం భారీ పారితోషికం డిమాండ్ చేస్తుంది. నిజానికి నయన్ నటించగా విడుదలై ఘన విజయం సాధించిన సినిమాలు తమిళనాట బాక్సాఫీస్ వద్ద దాదాపు20 కోట్ల షేర్ వసూలు చేస్తున్నాయి. ఇక ఇతర హక్కులతో నిర్మాతలు మరో 20, 30 కోట్లను దక్కించుకుంటున్నారు. దీంతో ఎలాంటి ఆలోచన లేకుండా నయన్ డిమాండ్ కి తగినట్లు 10 కోట్లు పారితోషికం ఇవ్వటానికి వెనుకాడటం లేదు. మరి అమ్మడి క్రేజ్ ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.
CM Jaganmohan Reddy: రైతులకు కనీస మద్ధతుధర ఇవ్వాల్సిందే