స్టార్ యాంకర్ ఓంకార్ తమ్ముడిగా జీనియస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు అశ్విన్ బాబు. రాజుగారి గది చిత్రంతో హిట్ కొట్టాడు. ఆ తర్వాత అడపా దడపా సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది రిలీజైన హిడింబతో సరికొత్త కథతో సినిమా చేసినప్పటికీ హిట్టు కొట్టలేకపోయాడు. తాజాగా శివం భజేతో మరోసారి థియేటర్లో అడుగుపెడుతున్నాడు అశ్విన్. అఫ్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్రైమ్ ఫాంటసీ థ్రిల్లర్ ట్రైలర్ కాసేపటి క్రితం విడుదల చేసారు యంగ్ హీరో విశ్వక్ సేన్.
ఇండియాని మ్యాప్ లో లేకుండా చేయాలనే లక్ష్యంతో పాకిస్థాన్ కుట్ర పన్నుతుంది. దాని కోసం ప్రమాదకమైన శక్తులను రంగంలోకి దించుతుంది. ఈ మిస్టరీని ఛేదించి, విధ్వంశం ఆపేందుకు పోలీసులకు స్పెషల్ ఏజెంట్ సాయం అవసరం అవుతుంది. పాకిస్తాన్ చేసిన కుట్రలో బాధితులుగా మారిన వాళ్లలో ఓ యువకుడు(అశ్విన్ బాబు) ఉంటాడు. ప్రాణాలతో బయట పడి ఇదంతా చేస్తున్నది ఎవరో తెలుసుకునేందుకు రంగంలో దిగుతాడు. అయితే కార్యసాధనను మానవశక్తితో పాటు దైవ సహాయం కూడా తోడ్పడుతుంది. అసలు మిస్టరీని హీరో ఎలా ఛేదించాడు అనేది మిగతా సినిమా..
మర్దర్ మిస్టరీ చుట్టూ అల్లిన కథా నేపధ్యాన్ని ఎంచుకున్నాడు అశ్విన్ బాబు. దానికి శివుడుతో ముడిపెట్టిన విధానం ఆసక్తికరంగా ఉంది. జై చిరంజీవ చిత్రం తర్వాత సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చాడు. మురళి శర్మ, బ్రహ్మజి, తులసి, హైపర్ ఆది ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వికాస్ బడిస ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఆగస్టు 1న థియేటర్లలో విడుదల కానుంది.
Also Read: Allu Arjun : పుష్ప దెబ్బకు ఇద్దరు యంగ్ హీరోలు అవుట్..