డిసెంబరు సినిమాల పంచాయతీ ఇప్పట్లో తెగేలా లేదు. అందరి కంటే ముందుగా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాల పరిస్థితి అయోమయంగా తయారయియింది. ఈ డిసెంబరులో అల్లు అర్జున్, సుకుమార్ ల పుష్ప – 2, శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ సినిమాలు థియేటర్లలోకి రానున్నట్టు అధికారకంగా ప్రకటించాయి. ఈ రెండు చిత్రాలతో పాటు విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప అదే నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూడు పెద్ద చిత్రాల విడుదలతో నాగ చైతన్య ‘తండేల్’ మరియు నితిన్,వెంకీ అట్లూరి రాబిన్‌హుడ్ ల పరిస్థితి గందరగోళంగా మారింది.
వాస్తవానికి అందరి కంటే ముందుగా ఈ రెండు సినిమాలను డిసెంబర్‌లో విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ చిత్రాలు విడుదల అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. నాగ చైతన్య, చందు మొండేటిల ‘తండేల్’ బన్నీ వాసు నిర్మిస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ రూ.75 కోట్లతో ఈ చిత్రం తెరెకెక్కుతోంది. సో డిసెంబరు స్లాట్ లో వస్తే కలెక్షన్లు తగ్గే అవకాశం ఉన్నందున సంక్రాంతి ఆలోచన చేస్తున్నారు. ఒకవెళ అక్కడ కుదరకుంటే ఇక ఫిబ్రవరికి వెళ్ళాలి. ఇక నితిన్ ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారి రాబిన్ హుడ్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. డిసెంబరు లో రాణి పక్షంలో ఫిబ్రవరికి వెళ్ళాలి. . కానీ డిసెంబరులో దిల్ రాజు సినిమా గేమ్ ఛేంజెర్, సంక్రాంతికి అనిల్ రావిపూడి రెండు సినిమాలతో వస్తున్నారు. మరి మైత్రి వెనక్కు తగ్గుతుందా డిసెంబర్ లో పోటీకి దిగుతుందా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది
Also Read: Bollywood dreams: ఇక్కడ హిట్లు వస్తున్నా.. అక్కడ ఆఫర్ల కోసం ఆరాటం..