Dragon OTT: తమిళ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘లవ్ టుడే’ సినిమాతో అటు తమిళ్, ఇటు తెలుగులో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా తోలి సినిమాతోనే ప్రదీప్ రంగనాథన్ వంద కోట్ల క్లబ్ లో చేరాడు. తనదైన కామెడీ టైమింగ్ తో విశేషంగా అలరించాడు ప్రదీప్. తాజాగా ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ యంగ్ హీరో. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రదీప్‌కి జోడిగా అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు.
Also Read : Posani Case : కోర్టు బెయిల్ ఇచ్చినా బయటకు రావడం డౌటేనా..?
ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ప్రధీప్. యూత్ ను ఆకట్టుకునే కథ, కథనాలతో వచ్చిన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్ల గ్రాస్ దాటి రూ. 150 కోట్ల దిశగా సాగుతుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న డ్రాగన్ ఓటీటీ స్ట్రీమింగ్ ను ముందుగా చేసుకున్న ఒప్పదం ప్రకారం రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నడ్రాగన్ ఈ వారాంతంలో చూడదగిన సినిమాగా చెప్పుకోవచ్చు. థియేటర్ లో సూపర్ హిట్ అయిన డ్రాగన్ ఓటీటీలో ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.