Prabhas : మోస్ట్ వెయిటెడ్ మూవీల్లో ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కూడా ఉంది. ఈ మూవీ కోసం సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రా అండ్ రస్టిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సందీప్ డైరెక్షన్ లో ప్రభాస్ ఎలా ఉంటాడో అని డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ ప్రకటించారు తప్ప ఇంకా స్టార్ట్ చేయలేదు. ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మంచి గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ మూవీ స్క్రిప్టు పనులు దాదాపు కంప్లీట్ అయ్యాయంట. త్వరలోనే ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Read Also : Rakul Preet : స్టైలిష్ డ్రెస్ లో రకుల్ ప్రీత్ సొగసులు..
ఉగాది పర్వదినాన ఈ మూవీని లాంఛనంగా స్టార్ట్ చేయబోతున్నారంట. ఆ రోజు అయితే అన్ని విధాలుగా బాగుంటుందని మూవీ టీమ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. రెగ్యులర్ షూటింగ్ కు ఇంకా టైమ్ పడుతుందంట. ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ, రాజాసాబ్ సినిమా షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఈ ఏడాది చివరికల్లా ఫ్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పటి నుంచే స్పిరిట్ మూవీని స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పిరిట్ సినిమాలో ప్రభాస్ మొదటిసారి పోలీస్ గా కనిపించబోతున్నాడు. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంటే మామూలుగా ఉండదని అభిమానులు ఆశిస్తున్నారు.