Shalini Pandey : షాలినీ పాండే చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. చాలా మంది తమకు ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక తాజాగా హీరోయిన్ షాలినీ పాండే కూడా తన లైఫ్ లో ఎదరైన ఘటన గురించి పంచుకుంది. అర్జున్ రెడ్డి సినిమాతో ఆమె సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ అయిపోయింది. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్నా.. ఆమెకు అనుకున్న స్థాయిలో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. అప్పటి నుంచి బాలీవుడ్ లోనే వరుసగా సినిమాలు చేస్తోంది.
Read Also : BJP: ‘‘ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నావా..?’’ రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
ఇక తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను సౌత్ ఇండియాలో సినిమా చేస్తున్న టైమ్ లో ఓ డైరెక్టర్ సడెన్ గా నా కరవాన్ లోకి వచ్చాడు. అప్పుడు నేను డ్రెస్ మార్చుకుంటున్నాను. అతని ప్రవర్తన చూసి నాకు చాలా కోపం వచ్చింది. అతని మీద కేకలు వేశాను. దాంతో అక్కిడి నుంచి వెళ్లిపోయాడు. మళ్లీ అతనితో సినిమా చేయొద్దని అనుకున్నాను. ఇప్పటికీ అతనితో మాట్లాడట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.