స్టార్ బ్యూటీ సమంత ఓ పాపులర్ షోకు హాజరైందని.. అందులో చైతన్యతో విడాకులపైనోరు విప్పిందని.. కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అదే షోకు వెళ్లేందుకు చరణ్, తారక్ నో చెప్పినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏంటా షో.. నిజంగానే మన స్టార్ హీరోలు దాన్ని రిజెక్ట్ చేశారా.. సమంత ఎపిసోడ్ ఎప్పుడు రాబోతోంది..!
అసలెందుకు సమంత, చైతన్య విడాకులు తీసుకున్నారనేది.. ఇప్పటికీ క్వశ్చన్ మార్క్‌గానే ఉంది. ఇప్పటి వరకు చైతూ గానీ, సమంత గానీ ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే సామ్ మాత్రం బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ చేసే కాఫీ విత్ కరణ్ షోలో.. ఇలాంటి విషయాలకు సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ ఓటిటి డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో.. ఆలియా భట్‌తో కాఫీ విత్ కరణ్ సీజన్ 7 మొదలైపోయింది. ఈ షోలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీస్‌తో పాటు.. దక్షిణాది స్టార్లు కూడా పాల్గోనట్టు తెలుస్తోంది. అందులోభాగంగా.. విజయ్ దేవరకొండ-సమంత.. అల్లు అర్జున్-రష్మిక హాజరైనట్టు టాక్. అయితే వీరిలో సమంత ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని.. ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారట నెటిజన్లు, అభిమానులు. కానీ బాలీవుడ్ వర్గాల ప్రకారం.. ఈ షోలో సమంతకు చెందిన కొన్ని ప్రశ్నలను కట్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే.. గతంలో బాహుబలి టీమ్ రాజమౌళి, ప్రభాస్, రానా ఈ షోకు హాజరైన సంగతి తెలిసిందే. దాంతో ఈ సారి కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో.. ఆర్ఆర్ఆర్‌తో సంచలనం సృష్టించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లని ఇన్వైట్ చేశాడట కరణ్ జోహార్. కానీ ఈ ఇద్దరూ మాత్రం కరణ్ ఇన్విటేషన్‌ని రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే నిజంగానే ఈ షోకు వీళ్లకు ఇన్విటేషన్ వచ్చిందా.. వస్తే ఎందుకు నో చెప్పారనేది.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏదేమైనా కాఫీ విత్ కరణ్ సీజన్ 7లో సమంత ఎపిసోడ్ హైలెట్ కానుందని చెప్పొచ్చు.