ఇండియన్ సినిమా బాక్సాఫీస్ స్టాండర్డ్స్ ని పెంచిన సినిమా బాహుబలి, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. నేషనల్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీలని కూడా అట్రాక్ట్ చేసింది పుష్ప గాడి ‘నీయవ్వ తగ్గేదే లే’ డైలాగ్… ఇవి గత కొన్నేళ్లలో తెలుగు సినిమా సాధించిన ఘనత. గోల్డెన్ ఫేజ్ లో ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చేస్తున్నన్ని క్వాలిటీ పాన్ ఇండియా సినిమాలు ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ చేయట్లేదు అంటే మన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అందుకే మన స్టార్ హీరోల సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతుంది అంటే ఏ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా రిలీజ్ కి పోటీ ఉండట్లేదు. తిరుగులేని తెలుగు సినిమా త్వరలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఫేస్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ విషయంలో బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
గతంలో ఒక ఇంటర్వ్యూలో రోహిత్ శెట్టి మాట్లాడుతూ… “మీరు ఎన్నో హిందీ సినిమాలు చూసి ఉంటారు. అక్షయ్ కుమార్, అజర్ దేవగన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ లాంటి స్టార్ హీరోలని చూసే ఉంటారు. ప్రపంచమంతా మన సినిమాలని చూస్తుంది, అలాంటిది ఒకటి రెండు సంవత్సరాలు సౌత్ సినిమాలు బాగా హిట్ అవ్వగానే మీరు హిందీ సినిమాని తక్కువ చేసి చూడకండి. షోలే మనమే చేసాం, మోఘలే అజమ్ మనమే చేసాం, మదర్ ఇండియా మనమే చేసాం… ఒక్క ఇయర్ వాళ్లవి హిట్ అయ్యే సరికి మీరు ప్లేట్ తిప్పేసి వాళ్లే గొప్ప అంటున్నారేంటి” అనేలా స్ట్రాంగ్ గానే కామెంట్స్ చేసాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ ని వైరల్ చేస్తూ… హిందీ చిత్ర పరిశ్రమ గురించి అంతగా చెప్తూ సౌత్ సినిమాలని లైట్ తీసుకున్నావ్ కదా… వచ్చే ఆగస్టు 15న పుష్ప 2తో క్లాష్ కి దిగు అంటూ నెటిజన్స్ రోహిత్ శెట్టిని ఛాలెంజ్ చేస్తున్నారు. రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సింగం 3 సినిమా 2024 ఆగస్టు 15న రిలీజ్ అవ్వనుంది, అదే రోజున పుష్ప 2 ఆడియన్స్ ముందుకి రానుంది. మరి బాలీవుడ్ గురించి గొప్పలు పోయిన రోహిత్ శెట్టి పుష్పగాడితో క్లాష్ కి వస్తాడా? లేక వెనకడుగు వేస్తాడా అనేది చూడాలి.