సంక్రాతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ కొట్టిన దిల్ రాజు అదే జోష్ లో పలు భారీ ప్రాజెక్టులును లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం వాటికి సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పనులు స్టార్ట్ చేసారు కూడా. అయితే నిన్న దిల్ రాజు మరొక బిగ్ అనౌన్స్‌మెంట్ కు రెడీ గా ఉండండి అని దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎక్స్’ ఖాతాలో చేసిన ట్వీట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. “బోల్డ్… బిగ్… బియాండ్ ఇమాజినేషన్” అని పేర్కొంటూ నేడు 11:08 గంటలకు ఈ భారీ ప్రకటన వివరాలు తెలియజేస్తామని తెలిపారు.
కాగా కొద్దీ సేపటి క్రితం ఆ ట్వీట్ కు సంబందించిన విషయాన్నీ అధికారకంగా ప్రకటిస్తూ ‘మా బ్లాక్ బస్టర్ నిర్మాత దిల్ రాజు క్వాంటమ్ ఏఐ గ్లోబల్ ద్వారా బ్రిలియంట్ మైండ్స్ తో కలిసి ఐ-పవర్డ్ మీడియా కంపెనీని స్టార్ట్ చేస్తున్నారు. చిత్రపరిశ్రమ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన అధునాతన AI సాధనాలను అభివృద్ధి చేయడానికి మరియు స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం ఏఐ సదుపాయాలను అందించడానికి స్టూడియో ఏర్పాటు చేయబోతున్నారు. స్టూడియో పేరును అలాగే లాంఛింగ్ వివరాలను రానున్న మే 4న తెలియజేస్తామని’ ప్రకటించారు. రానున్న రోజుల్లో వరల్డ్ క్లాస్ సదుపాయాలతో సినీ పరిశ్రమకు అవసరమయ్యే AI టెక్నాలజీని దిల్ రాజు అండ్ కంపెనీ అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.