Biggboss Telugu 7: సాధారణంగా ఒక ఇంట్లో అన్నదమ్ములు కానీ, అక్కాచెల్లెళ్లు కానీ ఉంటే.. వారిలో వారే గొడవపడుతూ ఉంటారు.. కొట్టుకుంటూ ఉంటారు. కానీ, అదే వారి మీదకు బయటవారు ఎవరైనా వస్తే మాత్రం.. అందరు కలిసి వారిపై పోరాడతారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ అలానే ఉంది. 13 మంది ఇంట్లో ఉన్నప్పుడు ఒకరిపై ఒకరు అరుచుకొని, కొట్టుకున్న కంటెస్టెంట్స్.. ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ రావడంతో అందరు కలిసిపోయారు. పాత హౌస్ మేట్స్ ను ఆటగాళ్లు అని .. కొత్త హౌస్ మేట్స్ ను పోటుగాళ్లని డిసైడ్ చేసి బిగ్ బాస్ .. రెండు టీమ్స్ గా మార్చాడు. అప్పటినుంచి ఆట రసవత్తరంగా సాగిపోతుంది. పాత కంటెస్టెంట్స్ లో ఒకరంటే ఒకరికి పడని శివాజీ, అమర్ దీప్ కూడా ఇప్పుడు ఒకే టీమ్ గా మారిపోయారు. కొత్తవాళ్ల కంటే తామేమి తక్కువ కాదని నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు. తమ శాయశక్తులా పోరాడుతున్నారు. నిజం చెప్పాలంటే.. పోటుగాళ్లు వచ్చాక ఆటగాళ్ల ఆట మారిపోయింది.
Mahesh Babu: మహేష్ బాబు న్యూ లుక్ చూసి షాక్ అవుతున్న ఫారినర్స్.. ఎందుకో తెలుసా?
వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన 5 గురు కంటెస్టెంట్స్ కు బిగ్ బాస్ కొత్త పవర్స్ ఇవ్వడం.. పాత కంటెస్టెంట్స్ పై ఆ పవర్ ను ఉపయోగించవచ్చు అని చెప్పడంతో పాతవారు ఫైర్ అయ్యి.. గేమ్స్ లో గెలిస్తే.. తమకు కూడా ఆ పవర్ రావొచ్చు అనే నమ్మకంతో ఆడుతున్నారు. ఒకప్పుడు టీమ్ స్పిరిట్ లేదన్న వారే.. ఇప్పుడు టీమ్ గా మారి.. పోటుగాళ్లకు చుక్కలు చూపిస్తున్నారు. మధ్య మధ్యలో అమర్ కొద్దిగా అయోమయంగా మారుతున్నా.. టీమ్ మొత్తం సపోర్ట్ చేస్తుండడంతో నెట్టుకొస్తున్నాడు. మరి ముందు ముందు ఈ ఆటగాళ్లు గెలుస్తారా..? పోటుగాళ్ళు గెలుస్తారా.. ? అనేది చూడాలి.