Mahesh Babu: మహేష్ బాబు న్యూ లుక్ చూసి షాక్ అవుతున్న ఫారినర్స్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే.. భారతదేశంలో మహేష్ కు ఫ్యాన్స్ ఉన్నారు.. తెలుగు టు హిందీ ప్రజలు ఆయన అందానికి ఫిదా అవుతున్నారు.. ఇక అమ్మాయిల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఏదో తెలియని వైబ్రేషన్స్ ఉన్నాయానే చెప్తారు.. మహేష్ అంత హ్యాండ్సమ్ గా ఉంటాడు..ప్రస్తుతం ఆయన వయస్సు 48 అయినా.. 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ యంగ్ హీరోలకు సైతం కుళ్లుకోవాల్సిందే అనేట్టుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తున్నారు.. భారీ వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతున్నారు.. అంతేకాదు ఎప్పటికప్పుడు న్యూ లుక్ ఫొటోలను ఫ్యాన్స్ కు షేర్ చేస్తారు..
మహేష్ స్టైలీష్ లుక్ లో అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నారంటూ ఇప్పటికే ఎంతో మంది కామెంట్స్ చేశారు. ఇక లండన్ వాసులు మహేష్ న్యూలుక్ చూసి ఫిదా అవుతున్నారు. ఆయన వయసును అంచనా వేయడంలో పొరపాటు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుది. ఇటీవల లండన్‌లో వీధుల్లో ఒక భారతీయ వ్యక్తి తన ఫోన్లో మహేష్ బాబు లేటేస్ట్ ఫోటో చూపిస్తూ.. ఆయన వయస్సును అంచనా వేయమని ప్రజలను అడిగాడు… అక్కడి వారంతా మహేష్ ను చూసి 20,25 అని చెప్పారు..
Also Read
ఇక చివరికి అతని వయస్సు చెప్పగానే షాక్ అవుతున్నారు.. అంటే మహేష్ అంత యంగ్ గా కనిపిస్తున్నారు.. ఇకపోతే రోజురోజుకు ఎగ్ తగ్గిస్తున్నారేమో అన్నట్లు యంగ్ గా మారుతున్నారు… అంతేకాదు వరుస సినిమాలలో నటిస్తూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నాడు..తాజాగా మహేష్ బాబు కొత్త ఫోటో కూడా వైరల్ అవుతుంది. జిమ్ లో వర్కవుట్ చేస్తోన్న ఫోటోను పంచుకున్నారు మహేష్. అందులో సీరియస్ లుక్‌లో స్పోర్ట్స్ టీ షర్ట్ ధరించి, హెడ్‌బ్యాండ్‌ని ఉపయోగించి జుట్టును వెనక్కి తిప్పి కట్టినట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం మహేష్ న్యూలుక్ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు మహేష్… ఆ తర్వాత రాజమౌళి తో సినిమా చెయ్యనున్నాడు….
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు