Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్-9 వైల్డ్ కార్డు ఎంట్రీల తర్వాత రచ్చ రచ్చగా మారిపోయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను హౌస్ లో జరిగే రచ్చ ఊపేస్తోంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అంతా ఎదురు చూశారు. ఎవరూ ఊహించని విధంగా రమ్యమోక్ష ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. ఈమె వచ్చిన వారం నుంచే లాయల్టీగా ఉండకపోవడం దెబ్బ తీసింది. వచ్చిన మొదట్లో చెప్పిన మాటలు వేరు. ఆమె చేష్టలు వేరు. దీంతో నిజాయితీగా ఉండట్లేదని బిగ్ బాస్ ప్రేక్షకులు ఓటింగ్ తక్కువగా వేసేశారు.
Read Also : Rana : తండ్రి కాబోతున్న హీరో రానా..?
ఈ వారం నామినేషన్లలో ఉన్న రమ్యకు ఇలా భారీ దెబ్బ పడింది. పైగా వచ్చినప్పటి నుంచి ఆటల మీద, టాస్కుల మీద దృష్టి పెట్టకుండా ఇతరుల మీద నిందలు వేయడంతోనే సరిపెట్టుకుంది. పవన్ ను అమ్మాయిల పిచ్చోడు అని చెప్పడం సంచలనం రేపింది. దానిపై క్షమాపణలు కూడా చెప్పింది. అయినా సరే తన తీరు మార్చుకోకపోవడంతో ఇలా దెబ్బ పడింది రమ్యకు. ఆమె చేసిన తప్పులే ఆమెను ఇలా త్వరగానే ఎలిమినేట్ అయ్యేలా చేశాయి. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఎక్కువ కాలం బిగ్ బాస్ లో ఉండకుండానే బయటకు వచ్చేస్తోంది. ఇప్పటికే ఆమె ఎలిమినేట్ కు సంబంధించిన షూటింగ్ కూడా అయిపోయిందంట.
Read Also : Allu Aravind : బన్నీవాసును పొట్టుపొట్టు తిట్టిన అల్లు అరవింద్..