హోంబలే ఫిల్మ్స్ ప్రొడక్షన్ హౌజ్ సోషల్ మీడియా అకౌంట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ అందరు ఫాలో అయ్యి ఉంటారు. ఈ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా అది సలార్ సినిమా గురించేమో అనే ఆలోచనలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు. డిసెంబర్ 22న సలార్ వస్తుంది కాబట్టి ఫ్యాన్స్ మరింత శ్రద్ధగా హోంబలే సోషల్ మీడియా పోస్టులని ఫాలో అవుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో హోంబలే నుంచి సలార్ సినిమా గురించి కాకుండా భగీర సినిమా గురించి అప్డేట్ బయటకి వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది. సలార్ రిలీజ్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి భగీర టీజర్ ఊహించని షాక్ ఇచ్చింది. ఉగ్రమ్ ఫేమ్ శ్రీ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథని అందించాడు. సూరి భగీర సినిమాని తెరకెక్కిస్తుండగా గణేశన్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో రిలీజ్ చేసిన భగీర మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
లేటెస్ట్ గా డిసెంబర్ 17న శ్రీ మురళి బర్త్ డే కావడంతో భగీర టీజర్ ని రిలీజ్ చేసారు హోంబలే ఫిలిమ్స్. శ్రీ మురళి భగీర టీజర్ లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించాడు. ఇప్పటివరకూ గ్యాంగ్ స్టర్ కథలనే రాసిన ప్రశాంత్ నీల్, మొదటిసారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో కథని రాసాడు. ఇక్కడ కూడా బ్లాక్ థీమ్ ని వదలలేదు, టీజర్ కంప్లీట్ గా ప్రశాంత్ నీల్ స్టైల్ లోనే డార్క్ గా ఉంది. జస్టిస్ కోసం యూనిఫార్మ్ వదిలేసి వార్ మొదలుపెట్టినట్లు ఉన్నాడు శ్రీమురళి. టీజర్ మేకింగ్ హైక్వాలిటీతో ఉంది, టీజర్ అజినీష్ లోకనాథ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఇంప్రెసివ్ గా ఉంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తుందా లేక రీజనల్ మూవీగానే ఉండిపోతుందా అనేది చూడాలి.
𝐖𝐡𝐞𝐧 𝐬𝐨𝐜𝐢𝐞𝐭𝐲 𝐛𝐞𝐜𝐨𝐦𝐞𝐬 𝐚 𝐣𝐮𝐧𝐠𝐥𝐞… 𝐚𝐧𝐝 𝐨𝐧𝐥𝐲 𝐨𝐧𝐞 𝐩𝐫𝐞𝐝𝐚𝐭𝐨𝐫 𝐫𝐨𝐚𝐫𝐬 𝐟𝐨𝐫 𝐣𝐮𝐬𝐭𝐢𝐜𝐞…💥
Presenting #BagheeraTeaser to you all ▶️ https://t.co/VRviuMij3o
Wishing our 'Roaring Star' @SRIMURALIII a very Happy Birthday.#Bagheera… pic.twitter.com/UxMAaJp1Qr
— Hombale Films (@hombalefilms) December 17, 2023