Ayushmann Khurrana: బాలీవుడ్ స్టార్ హీరో, సింగర్ ఆయుష్మాన్ ఖురానా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయుష్మాన్ ఖురానా తండ్రి ఆచార్య పి ఖురానా మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన పంజాబ్ లోని మొహాలీలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఖురానా కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇక పి. ఖురానా… జ్యోతిష్య రంగంలో స్థిరపడ్డారు. పంజాబ్ లో ఆయన రాసిన జ్యోతిష్య పుస్తకాలు చాలా ఫేమస్. ఇక తండ్రి మరణంతో ఆయుష్మాన్ కుంగిపోయాడు. చిన్నతనం నుంచి తాను ఏది చేయాలనుకొంటే దాన్ని తన తండ్రి సపోర్ట్ చేసినట్టు అతను చాలాసార్లు ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు.
ఒక్క సినిమా.. 550 సార్లు రీరిలీజ్.. హీరో ఎవరో తెలుసా..?
ఇక ఆయుష్మాన్ ఖురానా మంచి నటుడే కాకుండా మంచి సింగర్ కూడా. ఆయన నటించిన అంధుదాన్ సినిమానే తెలుగులో నితిన్ మ్యాస్ట్రో పేరుతో రీమేక్ చేశాడు. టీవీ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించిన ఆయన వికీ డోనర్ అనే సినిమాతో బాలీవుడ్ లో హీరోగా తెరంగేట్రం చేశారు.ఆ తరువాత వరుస సినిమాలను అందుకోవడం కాకుండా స్టార్ హీరోగా మారాడు. ప్రస్తుతం డ్రీమ్ గర్ల్ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆయుష్మాన్ తండ్రి మృతి తెలుసుకున్న ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.