పుష్ప2తో సరికొత్త రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ తన నెక్ట్స్ సినిమా కోసం ప్రిపేరవుతున్నాడు. త్రివిక్రమ్‌తో కాకుండా అట్లీతో చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ తో సినిమా కోసం అట్లీ భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. ఏకంగా వంద కోట్లు అడుగుతున్నాడన్నది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇప్పటి వరకు అరడజను సినిమాలు చేశాడు. ఇవన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే జవాన్‌తో బాలీవుడ్ కు వెయ్యి కోట్ల మార్క్ సినిమాను అందించాడు. దీంతో ఈ తమిళ దర్శకుడికి డిమాండ్ పెరిగిపోయింది. దీంతో బన్నీతో చేయబోయే సినిమా కోసం ఏకంగా వందకోట్లు కావాలని అడిగాడట.
Also Read : Bollywood : 29 ఏళ్లనాటి సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచనలో అమీర్, సల్మాన్.?
అట్లీ అంత అడిగేసరి ఈ సినిమాను నిర్మించాలనుకున్న సన్ ప్రొడక్షన్ హౌజ్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని కోలీవుడ్, టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ నడుస్తోంది. సన్ ప్రొడక్షన్ హౌజ్ తప్పుకోవడంతో అట్లీ అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పిందట ఓ తెలుగు నిర్మాణ సంస్థ. అయితే ఈ సమస్య సాల్వ్ అయినప్పటికీ మరో తలనొప్పి మిగిలి ఉన్నట్లు సమాచారం. తొలుత సినిమా కోసం శివకార్తీకేయన్ ను అడిగారని, ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇప్పుడు అతడి ప్లేసులో మరొక స్టార్ హీరోను తీసుకోబోతున్నారని తెలుస్తోంది. అయితే పుష్ప కోసం బన్నీ రూ. 300 కోట్ల రెమ్యునరేషన్ చార్జ్ చేశాడని అప్పట్లో టాక్ నడిచింది. పుష్ప 2తో ఇమేజ్ మారిపోవడంతో ఇప్పుడు దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటాడన్నది మరో బజ్. అలాగే అట్లీకి ముట్ట చెప్పబోయేది కూడా బోలెడవుతోంది. అందుకే సన్ పిచ్చర్స్ వైదొలినట్టు సమాచారం.