బాలీవుడ్‌లో ఒకప్పుడు త్రీ ఖాన్స్ మధ్య సెలైంట్ వార్ నడిచేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వీరి మధ్య బాండింగ్ పెరిగింది. ఛాన్స్ దొరికినప్పుడల్లా కింగ్ ఖాన్ షారూఖ్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కలుస్తున్నారు. రీసెంట్లీ మరోసారి మీటయ్యారు ఖాన్ త్రయం. ఆ వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ ఫరెఫెక్ట్స్ అమీర్ ఖాన్ మార్చి 14న 60వ వసంతలోకి అడుగుపెడుతున్నాడు. ఆయన బర్త్ డే సందర్బంగా స్నేహితులైన షారూఖ్ అండ్ సల్మాన్.. అమీర్ ఇంటికి వెళ్లి విషెస్ తెలిపారని తెలుస్తోంది. ప్రజెంట్ ఈ వీడియోలే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read : Marana Mass : హీరోగా డైరెక్టర్.. నిర్మాతగా యంగ్ హీరో
ఇదిలా ఉంటే ఇప్పుడొక ఇండస్ట్రింగ్ గాసిప్ ఒకటి పుట్టుకొచ్చింది. 1994లో వచ్చిన అమీర్, సల్మాన్ నటించిన సూపర్ హిట్ ‘అందాజ్ అప్నా అప్నా’ సీక్వెల్ తీయాలని అనుకున్నారని టాక్. 1994లో వచ్చిన ఈ కామెడీ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించాలని అమీర్, సల్మాన్ డిస్కస్ చేసుకున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందాజ్ అప్నా అప్నా దర్శకుడు కూడా ఈ బర్త్ డే వేడుకులకు హాజరు కావడం ఈ వార్తలకు ఆజ్యం పోసినట్లయ్యింది. కాగా, గత ఏడాది త్రీఖాన్స్ లో ఒక్కరు కూడా బాక్సాఫీస్ దగ్గర పలకరించలేదు. మార్చి మంత్ ఎండింగ్ లో సికందర్ అంటూ సల్లూభాయ్ హాయ్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ సీతారే జమీర్ పర్ కంప్లీటైనా రిలీజ్ ఎప్పుడవుతుందో తెలియదు. ప్రజెంట్ రజనితో కూలీ అనే తమిళ సినిమా చేస్తున్నాడు. అలాగే షారూక్ కింగ్ ప్రాజెక్ట్ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. మీడియాలో వస్తున్నట్టు ‘అప్నా అప్నా’ సీక్వెల్ సెట్ అయితే ఫ్యాన్స్ పండగ అనే చెప్పాలి.