భారీ బడ్జెట్ చిత్రాలకు ఏపీ ప్రభుత్వం షాక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను తమ ఇష్టానుసారంగా పెంచేసి అమ్ముతున్నారని, దానికి జీఎస్టీ ని కూడా వారు చెల్లించడం లేదని నాని అసెంబ్లీలో ఆరోపించారు. వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థను తీసుకురాబోతోందని చెప్పారు. ఈ విధానాన్ని ఏ నిర్మాత విమర్శించడంలేదని, కేవలం కొన్ని రాజకీయ పార్టీలే దీనిపై బురద చల్లుతున్నాయని అన్నారు. బీద వారికి ఏకైక వినోదసాధనంగా ఉన్న సినిమాను సరసమైన ధరకు అందించడమే ప్రభుత్వం కర్తవ్యమని, గతంలో థియేటర్ కౌంటర్ల దగ్గర కొద్ది టిక్కెట్లు అమ్మి, హౌస్ ఫుల్ బోర్డ్ పెట్టి, ఆ పైన బ్లాక్ లో టిక్కెట్లు అమ్మేవారని, అలాంటి వాటికి ఈ ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానంతో చెక్ పెడతామని తెలిపారు.
పెద్ద సినిమాలకు ఇక కష్టమే!
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతలకు షాక్ తగిలినట్టే. ఎందుకంటే కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు తొలి వారం రోజులలోనే తమ పెట్టుబడి తిరిగి రావాలని కోరుకుంటారు. అలా జరగని పక్షంలో సినిమా పైరసీకి గురై, ధియేటర్లకు జనం రాని పరిస్థితి ఏర్పడుతుంది. అలానే మూవీ రిలీజ్ అయిన తర్వాత నెగెటివ్ టాక్ వచ్చినా… జనం థియేటర్లకు రారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే భారీ చిత్రాల నిర్మాతలు అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయడం, తమ బడ్జెట్ కు తగ్గట్టుగా టిక్కెట్ రేట్లను పెంచి అమ్మడం చేస్తుంటారు. అయితే ప్రభుత్వం ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లు విక్రయిస్తూ కూడా ఆటలపై ఆంక్షలు పెట్టడం, టిక్కెట్ రేట్లను నియంత్రించాలని అనుకోవడం సమజసం కాదని కొందరు అంటున్నారు.
సినిమా టిక్కెటింగ్ వ్యవస్థను తమ చేతుల్లోకి తీసుకున్న తర్వాత కూడా ఇలా ఆటలపై, టిక్కెట్ రేట్లపై ఆకాంక్షలు విధిస్తే పెద్ద సినిమా నిర్మాతలకు తీరని నష్టం వాటిల్లుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరీ ముఖ్యంగా ఈ దెబ్బ డిసెంబర్ 2న విడుదల కాబోతున్న నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ మీద మొదట పడబోతోంది. ఇదే పద్థతిని అనుసరిస్తే, సంక్రాంతి సీజన్ లో విడుదలయ్యే పెద్ద సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ఆస్కారం ఉంది. మరి ప్రభుత్వం ఆటలు, టిక్కెట్ రేట్ల విషయంలో పునరాలోచన చేస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!