Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్‌ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gatta Kusthi 2: తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకున్న స్పోర్ట్స్ కామెడీ డ్రామా ‘గట్ట కుస్తీ’ (తెలుగులో మట్టి కుస్తీ). విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా వచ్చిన ఈ సూపర్ హిట్ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. అయితే, అసలు ఈ సెకండ్ పార్ట్ ఆలోచన ఎలా మొదలైంది, స్క్రిప్ట్ వెనుక జరిగిన కసరత్తులు ఏంటి అనే విషయాలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ చెల్లా అయ్యావు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గట్ట కుస్తీ కథ ఫస్ట్ పార్ట్‌లోనే పూర్తిగా కంప్లీట్ అయ్యింది. అందుకే హీరో విష్ణు విశాల్ వచ్చి పార్ట్-2 చేద్దామని అడిగినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ‘కథ అయిపోయింది కదా, ఇక రెండో భాగం ఎలా తీస్తాం?’ అని అన్నాను. ఆ తర్వాత ఆయనకు మరో కొత్త కథ కూడా వినిపించాను. కానీ విష్ణు మాత్రం ‘గట్ట కుస్తీ 2’ చేయడానికే మొగ్గు చూపారు. దాంతో నేను ఒక ఐడియా లైన్ అనుకుని ఆయనతో చర్చించాను. కేవలం ఒక 30 నిమిషాల డిస్కషన్ తర్వాత ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఒక స్కెలెటన్ రెడీ అయ్యింది” అని అన్నారు.
సెకండ్ పార్ట్ గనక మొదటి భాగం రేంజ్లో లేకపోతే ప్రేక్షకులు అస్సలు ఆదరించరని విష్ణు విశాల్‌కి ముందే చెప్పానని డైరెక్టర్ పేర్కొన్నారు. అందుకే ముందుగా స్క్రిప్ట్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టామని, కథ అనుకున్న విధంగా అద్భుతంగా కుదిరిన తర్వాతే షూటింగ్ స్టార్ట్ చేశామని అన్నారు. పార్ట్-1 నచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ పార్ట్-2 కచ్చితంగా నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, ఫస్ట్ పార్ట్‌లోని నటీనటులంతా ఇందులోనూ ఉంటారని డైరెక్టర్ స్పష్టం చేశారు. కథ అక్కడి నుంచే నేరుగా కొనసాగుతుందని.. అదనంగా ఈ పార్ట్‌లో రమ్యకృష్ణ, యోగి బాబు, కరుణాకరన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని లీక్ ఇచ్చారు. అంతేకాదు, దీని రెస్పాన్స్ని బట్టి ‘గట్ట కుస్తీ 3’పై నిర్ణయం తీసుకుంటామని, అయితే పార్ట్-3 కోసం ఎలాంటి లీడ్ సెటప్ లేదా క్లిఫ్ హాంగర్ సీన్లను ఫైనల్ కట్లో ఉంచలేదని క్లారిటీ ఇచ్చారు.
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
కథ ఇదే..
ఫస్ట్ పార్ట్‌లో తన బిడ్డపై ఒట్టు వేసి, భార్యను కచ్చితంగా ఛాంపియన్‌ను చేస్తానని హీరో ఒక ప్రామిస్ చేస్తాడు. ఆ మాటను అతడు నిలబెట్టుకున్నాడా లేదా? అనే పాయింట్ చుట్టూనే ఈ ‘గట్ట కుస్తీ 2’ కథ సాగుతుందని దర్శకుడు హింట్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీ డీల్ గురించి మాట్లాడుతూ.. “నెట్‌ఫ్లిక్స్ టీమ్ ఈ కథను వెంటనే ఓకే చేయలేదు. వారికి స్క్రిప్ట్ విషయంలో కొన్ని సందేహాలు వచ్చాయి. ఆ తర్వాత మేము కథాలో కొన్ని కీలక మార్పులు చేసి వినిపించడంతో వారు సంతృప్తి చెంది, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు” అని చెల్లా అయ్యావు చెప్పుకొచ్చారు. సరికొత్త ఎమోషన్స్, భారీ తారాగణంతో రాబోతున్న ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేయనుందో చూడాలి.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!