ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్ రేట్లు, ఆటల ప్రదర్శనపై ఓ క్లారిటీకి వచ్చింది. దానికి తగ్గట్టుగా సినిమాటోగ్రఫీ చట్టం సవరణల బిల్లును రాష్ట్ర మంత్రి పేర్ని నాని అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇక మీదట రోజుకు నాలుగు ఆటలు మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని; పెద్ద, చిన్న అనే తేడా లేకుండా అన్ని సినిమాలకు ఒకే టిక్కెట్ రేట్ ఉంటుందని నాని చెప్పారు. పెద్ద సినిమాల విడుదల సమయంలో అత్యధిక షోస్ ప్రదర్శిస్తున్నారని, అలానే టిక్కెట్ రేట్లను…