Anchor Suma: సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు చేయననవసరం లేదు. ఆమె లేనిదే ఎలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ జరగవు. ముఖ్యంగా స్టార్ హీరోల ప్రమోషన్స్ అయితే అస్సలు జరగవనే చెప్పాలి. యాంకర్ గా సుమ ఎంతో గుర్తింపును అందుకుంది. ఇక ఒకపక్క యాంకరింగ్ చేస్తూనే ఇంకోపక్క నటిగా కూడా తన సత్తా చాటుతోంది. గతేడాది జయమ్మ పంచాయితీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక సుమ భర్త రాజీవ్ కనకాల సైతం తనదైన నటనతో మంచి సినిమాల్లో అవకాశాలు అందుకొని మంచి నటుడుగా కొనసాగుతున్నాడు. చిత్ర పరిశ్రమలో నేపోటిజం ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కోవలోకి సుమ కొడుకు రోషన్ కూడా చేరాడు. అవును.. సుమ కొడుకు రోషన్ హీరోగా మారుతున్నాడు.
Chaitanya Jonnalagadda: నిహారిక మాజీ భర్త రెండో పెళ్లి.. అమ్మాయి ఎవరంటే.. ?
ఇప్పటికే చిన్న చిన్న పాత్రలతో పలు సినిమాల్లో నటించిన రోషన్.. హీరోగా మారుతున్నట్లు సుమ అధికారికంగా ప్రకటించింది.అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇక ఈ నేపథ్యంలోనే రోషన్ .. తన మేకోవర్ ను తీర్చిదిద్దుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట. ఇదొక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అని సమాచారం. ఈ సినిమాను రవికాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ముందుతో పోల్చుకొంటే.. రోషన్ లుక్ చాలా మారిందని చెప్పొచ్చు. ఈ సినిమాతో కొడుకు ఎంట్రీ గ్రాండ్ గా ఉండాలని సుమ- రాజీవ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి రోషన్ ఎలాంటి ఎంట్రీ ఇస్తాడో చూడాలి.