పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటింది, పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయ్యి కూడా ఏడాది దాటింది. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, రష్మికలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చి కూడా ఏడాది అయ్యింది. ఇలా పుష్ప సినిమాకి సంబంధించిన ప్రతి విషయం జరిగి వన్ ఇయర్ అయ్యింది. ఈ ఏడాది కాలంలో పుష్ప రీరిలీజ్ కు, పుష్ప రష్యా రిలీజ్ లు చూస్తున్నారు కానీ బన్నీ ఫాన్స్ కి పుష్ప 2 అప్డేట్ మాత్రం దొరకట్లేదు. పుష్ప ది రూల్ అప్డేట్ కోసం ధర్నాలు చేసిన ఫాన్స్ ఉన్నారు, వీ వాంట్ పుష్ప 2 అప్డేట్ అని సోషల్ మీడియాని షేక్ చేసిన వాళ్లు ఉన్నారు, గీత ఆర్ట్స్ కి ర్యాలీ చేసిన వాళ్లు కూడా ఉన్నారు. ఎవరు ఎంత చేసినా పుష్ప ది రూల్ కి సంబంధించిన అప్డేట్ మాత్రం బయటకి రాలేదు.
Read Also: NBK X PK: నిప్పుకొండ, నిలువెత్తు రాజసం… కలిస్తే చరిత్ర తిరగ రాయడం ఖాయం…
రీసెంట్ గా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది అనే క్లారిటీ అయితే వచ్చింది కానీ అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. కనీసం పండగలకి, పబ్బాలకి కూడా శుభాకాంక్షలు చెప్తూ ఒక్క పోస్టర్ కూడా బయటకి రావట్లేదు. సంక్రాంతికి అయినా పుష్ప 2 నుంచి అప్డేట్ వస్తుందని బన్నీ ఫాన్స్ వెయిట్ చేశారు కానీ అదీ అవ్వలేదు. సంక్రాంతి లాంటి పెద్ద పండగకి కూడా అప్డేట్ బయటకి రాకపోవడంతో అల్లు అర్జున్ ఫాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. పుష్ప 2 షూటింగ్ ఎక్కడి వరకూ జరిగిందో? ఈ మూవీ అఫీషియల్ అప్డేట్ ని ఎప్పుడు బయటకి వదులుతారో అనే బన్నీ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ వెయిటింగ్ కి దర్శక నిర్మాతలు ఎండ్ కార్డ్ ఎప్పుడు వేస్తారో చూడాలి.