Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. బన్నీ సినిమాల విషయం పక్కన పెడితే.. పెళ్లి తరువాత బన్నీలో చాలా మార్పు వచ్చింది. అయితే షూటింగ్.. లేకపోతే ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం చేస్తున్నాడు. ఇక బన్నీ పిల్లల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కుటూరు అల్లు అర్హ గురించి అయితే అస్సలు పరిచయమే చేయనవసరం లేదు. అల్లువారి యువరాణి.. పుట్టినప్పటినుంచే ప్రిన్సెస్ గా మారిపోయింది. ఆమెకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అతిశయోక్తి కాదు. ఇక బన్నీతో కలిసి ముద్దు ముద్దు మాటలు చెప్తూ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటుంది. అయితే అర్హకు కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోవయింగ్.. బన్నీ కొడుకు అయాన్ కు ఉండదు. అర్హ అల్లరి పిల్ల అయితే.. అయాన్ చాలా నిదానం. కానీ కొన్నిరోజుల నుంచి అయాన్ ట్రోల్ మెటీరియల్ గా మారిన విషయం తెల్సిందే. ట్రోల్ అయితే అయ్యాడు కానీ, అయాన్ ను కూడా జనాలు గుర్తిస్తున్నారు.
Animal: మొన్న భార్య.. ఇప్పుడు నాన్న.. యానిమల్ ఎమోషన్స్ వేరే లెవెల్ అంతే
ఇక ఇవన్నీ పక్కన పెడితే.. నిన్న దీపావళీ సెలబ్రేషన్స్ అల్లు ఇంట ఓ రేంజ్ లో జరిగాయి. క్యూటీ ఫై అల్లు అర్హ.. తండ్రి బన్నీ చెయ్యి పట్టుకొని క్రాకర్స్ కాల్చింది. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఏ వీడియోలో కూడా అయాన్ కనిపించలేదు. తాజాగా స్నేహ తమ ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేసింది. అందులో కూడా అయాన్ మిస్ అయ్యాడు. దీంతో అభిమానులు అయాన్ ఎక్కడ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. డిజైనర్ కుర్తాలో బన్నీ, స్నేహ, అర్హ ఎంతో అందంగా కనిపించారు. అయాన్ కూడా ఉంటే ఇంకా బావుండేది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.