Akkineni Nagrjuna: ప్రస్తుతం టాలీవుడ్ లో రీమేక్ ల హవా నడుస్తోంది. వేరే భాషలో హిట్ అయిన సినిమాలను తెలుగు భాషల్లో స్టార్ హీరోలు రీమేక్ చేస్తున్నారు. అయితే విచిత్రం ఏంటంటే.. ఆ సినిమా తెలుగులో డబ్ అయినా కూడా మళ్లీ రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మద్యకాలంలో మెగా బ్రదర్స్ రీమేక్స్ మీదనే నడుస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ రీమేక్స్ చేస్తున్నారు. చిరు నటించిన గాడ్ ఫాదర్, భోళా శంకర్ రీమేక్సే. ఇక పవన్.. భీమ్లా నాయక్, బ్రో.. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేకే. ఇక భోళా తరువాత చిరు రీమేక్స్ ఫుల్ స్టాప్ పెట్టాడని టాక్. అయితే .. చిరు వదిలేస్తే .. ఇప్పుడు రీమేక్ ను నాగార్జున నమ్ముకున్నాడు. అక్కినేని నాగార్జున ఈ మధ్య సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక అక్కినేని అభిమానులు.. అసలు నాగ్ సినిమాలు చేస్తాడా.. ? బిగ్ బాస్ కే పరిమితమవుతాడా.. ? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. ఇక ఈ నేపథ్యంలోనే నాగ్ తన పుట్టినరోజు గిఫ్ట్ గా కొత్త సినిమాను ప్రకటించి ఫ్యాన్స్ ను ఆనందపరిచాడు. నా సామీరంగా సినిమాతో నాగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sapthami Gowda: కాంతార బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ‘తమ్ముడు’ తోనే..?
విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న పోరింజు మరియం జోస్ సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అందులో జోజు జార్జ్ హీరోగా నటించాడు. ఊర మాస్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎప్పటినుంచో ఈ సినిమాను నాగ్ రీమేక్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక నాగ్ బర్త్ డే వీడియో రిలీజ్ చేశాక .. రీమేక్ అని కన్ఫర్మ్ చేశారు అభిమానులు. ఇక మలయాళంలో ఈ సినిమా కథ బావుంటుంది. తెలుగులో ఏమైనా మార్పులు చేర్పులు చేశారు అనేది తెలియదు కానీ, ఈ సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే.. ఈ సినిమా తెలుగులో డబ్ అవ్వలేదు. 2019 లో రిలీజ్ అయిన చిత్ర కాబట్టి ప్రేక్షకులకు కూడా చాలా రేర్ గా తెలుసు. దీంతో నాగ్.. ఈ రీమేక్ చేయడం మంచిదే అని అంటున్నారు. చిరు రీమేక్స్ తో ప్లాప్ ను అందుకున్నాడు.. మరి నాగ్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.