Akhil Akkineni:అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ పెంచేసిన మేకర్స్ నేడు వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేశాడు. ఈ వేదికపై అఖిల్ మాట్లాడుతూ.. రెండేళ్లు తాను ఈ సినిమా కోసం కష్టపడ్డానని చెప్పుకొచ్చాడు. రెండేళ్ల క్రితం సురేందర్ రెడ్డిని మీట్ అయ్యినప్పుడు.. ఒక క్రేజీగా ప్రాజెక్ట్ చేద్దామని అనుకున్నాం. అది ఇప్పుడు ఇలా అయ్యిందని తెలిపాడు. ఇక ఈ సినిమాను అనుకున్నట్లుగా క్రేజీగానే చేశాం.. కానీ, ఇంత వైల్డ్ గా తీసిన సినిమా థియేటర్ కు వెళ్తుంది అన్నదానికన్నా.. దీని తరువాత నేను ఏమైపోతానోనని అనుమానంగా ఉందని, ఇంత హైలో పనిచేశాక తరువాత ఎలాంటి సినిమా చేయాలి అన్న ప్రశ్న మిగిలిపోయింది అని చెప్పుకొచ్చాడు.
Shivathmika Rajashekar: అలాంటి పాత్రల కోసమే ఇలా చేస్తున్నావా పాపా..
“ఇక ఈ రెండేళ్లలో బాడీ కంటే మెంటల్ గా ఎక్కువ స్ట్రెంత్ తెచ్చుకున్నాను. ఈ రెండేళ్లు ఈ చిత్ర బృందం చేసినదానికి నేను ఠంక్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే . ఈరోజు ఇక్కడ నిలబడడానికి దైర్యం, బలం, నమ్మకం ఇచ్చింది. ఏజెంట్ ఇచ్చినందుకు సురేందర్ రెడ్డికి థాంక్స్ చెప్తున్నాను. అనిల్ గారు లేకపోతే ఇలాంటి సినిమా వచ్చేది కాదు. ఇక హీరోయిన్ సాక్షికి థాంక్స్.. మిగతా చిత్ర బృందానికి థాంక్స్. ఇక ఈ సినిమాలో నా మెమొరీబుల్ మూమెంట్ అంటే మమ్ముట్టి సర్ మా ప్రాజెక్ట్ ను ఒప్పుకోవడమే. ఇలాంటి రోల్ ఆయన ఎప్పుడు ఒప్పుకోలేదు. మా సినిమాను ఒప్పుకున్నందుకు థాంక్యూ సర్..మీరు రాకపోయినా మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉంటాయి.. వర్షం పడినా అభిమానులు వచ్చినందుకు థాంక్స్. మీరు ఎంత ఇచ్చినా నేను తీసుకుంటాను” అంటూ ముగించాడు.