అసలు హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తారని ఎవవరైనా ఊహించారా? కానీ ఈ ఇద్దరు కలిసి వండర్స్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అది కూడా యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్‌గా చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్ కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్‌లో ‘వార్2’ ఇప్పటివరకు ఎవరు చూడనంత బిగ్గెస్ట్ మల్టీస్టారర్‌గా రాబోతోంది. జై లవ కుశ సినిమాలో నెగెటివ్ రోల్‌లో దుమ్ము దులిపిన తారక్.. ఈసారి బాలీవుడ్ హల్క్‌తో వార్ చేయడానికి రెడీ అవుతున్నాడు. అసలు హృతిక్ రోషన్ లాంటి హీరోతో ఎన్టీఆర్ ఢీ కొడితే, ఆ బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది. ఇక ఈ ఇద్దరితో తలపడేందుకు మరో స్టార్ హీరో కూడా యాడ్ అయితే ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. నెక్స్ట్ వార్ 3తో అదే జరగబోతున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న వార్2 ఈ ఏడాది నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర షూటింగ్ అయిపోగానే.. వార్ 2లో జాయిన్ అవనున్నాడు.
నెక్స్ట్ ఇయర్‌లో వార్ 2 ఆడియెన్స్ ముందుకు రానుంది. ఇక ఆ తర్వాత యశ్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగంగా వార్ 3కి కూడా రంగం సిద్దమవుతోందట. అంతేకాదు వార్ 3లో వార్ పీక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఏకంగా ముగ్గురు స్టార్ హీరోలు కలిసి నటించబోతున్నారనే న్యూస్ వైరల్‌గా మారింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌లతో పాటు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఈ ప్రాజెక్ట్‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే.. పాన్ ఇండియ లెవల్లో ఈ సినిమానే బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కానుంది. టాలీవుడ్ నుంచి ఎన్టీఆర్, బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్, కోలీవుడ్ నుంచి సూర్య అంటే.. వార్ 3 నెవర్ బిఫోర్ సినిమాగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి ఇది రూమరే అయినా ఈ న్యూస్ మాత్రం కోలీవుడ్ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.