Anirudh Ravichander:సూపర్ స్టార్ రజినీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం జైలర్. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ తమన్న హీరోయిన్ గా నటించగా.. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్.. క్యామియోలో నటించారు. ఆగస్టు 10న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. రజినీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా రికార్డ్ సృష్టించడమే కాకుండా దాదాపు రూ.600 కోట్లు కలెక్షన్స్ కాబట్టి చరిత్ర సృష్టించింది. ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ అంతా ఒక ఎత్తు అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ మరో ఎత్తు అని చెప్పాలి. సాంగ్స్, రజనీకాంత్ మోహన్ లాల్, శివన్న ఎలివేషన్ మ్యూజిక్ వేరే లెవెల్ అంటే అతిశయోక్తి కాదు. ఇక వర్మ ప్లే లిస్ట్ మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు.
Ustad Bhagat Singh: కత్తులతో ఉస్తాద్ డైరెక్టర్.. మనల్ని ఎవడ్రా ఆపేది?
ఇక సినిమా హిట్ కావడంతో నిర్మాత కళానిధి మారన్.. డైరెక్టర్ నెల్సన్ కు కాస్ట్లీ కార్డును గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకొపక్క రజనీకాంత్ కు చెక్ ను కూడా అందించాడు. ఇక వీరికి గిఫ్ట్లు ఇవ్వడం చూసిన అభిమానులు అనిరుధ్ కూడా గిఫ్ట్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఎందుకంటే అనిరుధ్ లేకపోతే జైలర్ సినిమా ఇంతటి విజయాన్ని అయితే అందుకోలేదని, ఆయన కచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో కళానిధి మారన్ ఈరోజు అనిరుధ్ ఇంట కార్ల షోరూమ్ ని ఓపెన్ చేశాడు. పోర్షే, బీఎండబ్ల్యూ, ఫెరారీ మూడు కార్లు లైన్లో పెట్టించి.. ఏది కావాలంటే అది తీసుకోమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. ఇక అనిరుధ్ మూడు కారులను చెక్ చేసి బ్లాక్ పోర్షే కారును ఎంచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ కారు విలువ దాదాపు రెండు కోట్ల పైనే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ఆ మ్యూజిక్ కు ఏ గిఫ్ట్ ఇచ్చిన తప్పు లేదయ్యా అంటూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత అనిరుధ్ దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి దేవరతో అనిరుధ్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి.
To celebrate the humongous Blockbuster #Jailer, Mr. Kalanithi Maran presented the key of a brand new Porsche car to @anirudhofficial#JailerSuccessCelebrations pic.twitter.com/lbkiRrqv7B
— Sun Pictures (@sunpictures) September 4, 2023