టాలీవుడ్ యంగ్ స్టార్ ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’. విజన్ సినిమాస్ బ్యానర్‌పై నాగం తిరుపతి రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తోంది. హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ‘తీస్ మార్ ఖాన్’కు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రొగ్రెస్ ను దర్శకుడు కళ్యాణ్ తెలియచేస్తూ, ”ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ఆదరణ పొందింది. మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రను పోషిస్తున్న ఆది సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాలకు భిన్నంగా, ఇది వరకు చూడని సరికొత్త క్యారెక్టరైజేషన్‌తో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా ఆకట్టుకోనుంది. ప్రస్తుతం గోవాలో సినిమా షూటింగ్ జరుగుతోంది. హీరో, హీరోయిన్స్‌పై రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నాం. ఆది సాయికుమార్ డాన్స్, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలువనుంది” అని అన్నారు. సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను సునీల్, అనూప్ సింగ్ ఠాకూర్, కబీర్ సింగ్ ఠాకూర్, పూర్ణ తదితరులు పోషిస్తున్నారు.