Adah Sharma Interesting Post On The Kerala Story Success: చాలాకాలం నుంచి సరైన ఆఫర్లు లేక ఎన్నో తంటాలు పడిన అదా శర్మ.. ఇప్పుడు ‘ద కేరళ స్టోరీ’ సినిమా పుణ్యమా అని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. లేటెస్ట్‌గా ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. ఈ నేపథ్యంలోనే అదా శర్మ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. ఈ సినిమా చేశాక తన నిజాయితీని, చిత్తశుద్ధిని అపహాస్యం చేశారని.. బెదిరింపులు కూడా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేసినా.. ప్రేక్షకులు మాత్రం ఆదరించి భారీ విజయాన్ని అందించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆ పోస్ట్‌లో పేర్కొంది.
Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..
‘‘నా నిజాయితీని అపహాస్యం చేశారు. చిత్తశుద్దిని చులకనగా చూశారు. ద కేరళ స్టోరీ టీజర్ రిలీజ్ అయినప్పుడు.. ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని మమ్మల్ని బెదిరించారు. కొన్ని రాష్ట్రాలు మా సినిమాని బ్యాన్ చేశాయి. అయినప్పటికీ.. ప్రేక్షకులు మా సినిమాని ఆదరించి, భారీ విజయాన్ని అందించారు. మొదటి వారంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి ఫీమేల్ లీడ్ సినిమాగా దీన్ని మలిచారు. ప్రేక్షకులారా.. మీరు గెలిచారు. మా సినిమాను ఇంతలా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు’’ అంటూ అదా శర్మ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో ద కేరళ స్టోరీ విజయంతో అదా శర్మ ఎంత సంతోషంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్‌లో ఈ అందాల భామ ఎన్నో సినిమాలు చేసింది కానీ, ఇంతటి ఘనవిజయాన్ని అందుకోవడం మాత్రం ఇదే మొదటిసారి. అందుకే, ఇంతలా మురిసిపోతోంది.
Vivek Agnihotri: అందరూ అందుకోసమే పెళ్లి చేసుకుంటున్నారు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
కాగా.. కేరళలోని లవ్ జిహాద్, రాడికలైజేషన్, ఐసిస్ రిక్రూట్‌మెంట్, లైంగిక బానిసత్వం లాంటి అంశాల ఆధారంగా ద కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించారు. లవ్ జిహాద్ వల్ల ముగ్గురు అమ్మాయిలు ఎలాంటి దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొన్నారనే నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. ఇందులో అదా శర్మ ప్రధాన పాత్ర పోషించగా.. సిద్ధి ఇద్నాని, యోగితా బిహాని, సోనియా బలాని, దేవదర్శిని కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకుడు.
Discrediting my sincerity, mocking my integrity , threats ,
Our teaser getting shadow banned,the movie getting banned in certain states,slander campaigns launched…BUT you ,the audience made #TheKeralaStory the no1 female lead movie first week of all time !!wowww! Audience aap… pic.twitter.com/yxZhTSRq8G— Adah Sharma (@adah_sharma) May 13, 2023