Vivek Agnihotri Shocking Tweet on Marriages: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. పెను సంచలనాలకు తెరలేపే సెలెబ్రిటీల్లో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఒకరు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా తీసినప్పటి నుంచి.. ఆయన నిత్యం కాంట్రొవర్షియల్ కామెంట్స్‌తో వార్తల్లోకెక్కుతూనే ఉన్నాడు. తనకు సంబంధం లేని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతున్నాడు. ఇప్పుడు అతడు ట్విటర్ మాధ్యమంగా.. ఈమధ్యకాలంలో జరుగుతున్న పెళ్లిళ్లపై ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ఈరోజుల్లో ప్రతిఒక్కరూ కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
Leopard Attack: రెండేళ్ల చిన్నారిని చంపిన చిరుత.. వారంతో వ్యవధిలో మూడో ఘటన
మే 13వ తేదీన ఢిల్లీలో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత.. వివేక్ ఒక ట్వీట్ చేశాడు. ‘‘ఈ రోజుల్లో అందరూ కేవలం ఫోటోలు, వీడియోల కోసమే పెళ్లి చేసుకుంటున్నారు. ‘డెస్టినేషన్ వెడ్డింగ్’ అనే ట్యాగ్ పొందడం కోసం, పెళ్లి చేసుకుంటున్నారని నాతో ఒక వెడ్డింగ్ ప్లానర్ చెప్పడు. నేను ఓ డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పాల్గొన్నప్పుడు.. ఆ వివాహ వేడుకకి ఫోటోగ్రాఫర్ ఆలస్యంగా వస్తున్నాడని ఎవరో చెప్పారు. అది విని వధువు స్పృహ తప్పి పడిపోయింది’’ అంటూ ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. పరిణీతి, రాఘవ్ చద్దా నిశ్చితార్థం తర్వాత వివేక్ ఈ ట్వీట్ చేయడంతో.. ఇది చర్చనీయాంశంగా మారింది.
Jagadish Shettar: “నా ఓటమికి కారణం అదే”.. కర్ణాటక మాజీ సీఎం వ్యాఖ్యలు..
కాగా.. వివేక్ అగ్నిహోత్రి ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు తీశాడు. కానీ.. ‘ద కశ్మీర్ ఫైల్స్’తో ఆయన పేరు మార్మోగిపోయింది. ఆ సినిమా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. కశ్మీర్‌లో హిందూ పండితులపై జరిగిన దాడుల నేపథ్యంతో ఆయన ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కొవిడ్ సమయంలో దేశం ఎదుర్కున్న సమస్యలను చూపించనున్నారు.