Sneha: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాధా గోపాళం, సంక్రాంతి, ప్రియమైన నీకు లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించిన స్నేహ అచ్చ తెలుగు అమ్మాయిలనే అభిమానుల గుండెల్లో కొలువైపోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే కోలీవుడ్ హీరో ప్రసన్నను ప్రేమించి పెళ్లాడింది. వీరికి ఒక బాబు, ఒక పాప. ఇక ప్రస్తుతం స్నేహ సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే బుల్లితెరపై ఒక రియాలిటీ షో కు జడ్జిగా వ్యవహరిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి స్నేహ వైవాహిక జీవితం గురించి ఒక రూమర్ నెట్టింట వైరల్ గా మారింది.
స్నేహ..భర్త ప్రసన్న నుంచి విడిపోయిందని, త్వరలోనే విడాకులు కూడా ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కొన్ని రోజుల నుంచి ఈ జంట మధ్య విబేధాలు నెలకొన్నాయి అని, ప్రస్తుతం స్నేహ భర్త నుంచి దూరం గా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. 10 ఏళ్ళ కాపురంలో ఈ జంట ఒక్క ఫ్రేమ్ లోను సింగిల్ గా కనిపించింది లేదు. నిత్యం భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ, ఎక్కడికి వెళ్లినా ఈ జంట కలిసి వెళ్తూ ఉంటారు. కాగా, గత కొన్ని రోజుల నుంచి స్నేహ ఒక్కతే కనిపిస్తుందని, ఆమె తన ఇంటి వద్ద కాకుండా వేరే ఇంట్లో సింగిల్ గా ఉంటుందని కోలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉన్నది అనేది తెలియాలంటే స్నేహ కానీ, ప్రసన్న కానీ నోరు విప్పక తప్పదు అంటున్నారు స్నేహ అభిమానులు.