Kamal Haasan: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మనల్ని ఇన్స్పైర్ చేసిన వారిని కలిసినప్పుడు వచ్చే సంతోషం మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి సంతోషంలోనే మునిగి తేలుతున్నాడు కోలీవుడ్ డైరెక్టర్ జూడ్ ఆంథోని జోసఫ్. అదేనండీ.. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన 2018 సినిమా డైరెక్టర్. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ లో ఈ డైరెక్టర్ పై చాలా మంది హీరోలే కన్ను వేశారు. ఇతనితో చిరంజీవి సినిమా కూడా ఓకే అయ్యిందని వార్తలు కూడా వచ్చాయి. ఇకపోతే నేడు జూడ్.. తన జీవితంలో కలలు కన్న ఒక కలను నిజం చేసుకున్నాడు. అదే లోక నాయకుడు కమల్ హాసన్ ను కలవడం. నేడు ఆయన కమల్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించాడు. 2018 సినిమాను కమల్ మెచ్చుకున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయాన్నీ జూడ్ తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తనకు జీవితంలో పట్టరానంత సంతోషం ఎలా ఉంటుందో ఈరోజే అనుభవించాను అని చెప్పుకొచ్చాడు.
Sai Pallavi : కాశ్మీర్ లో సందడి చేస్తున్న సాయి పల్లవి.. వైరల్ అవుతున్న పిక్స్..
” నన్ను ఫిల్మ్ మేకర్/నటుడు లేదా సినిమా బఫ్ అని పిలవగలిగితే, అది ఈ మల్టీ టాలెంటెడ్ మేధావి వల్ల మాత్రమే. నేను స్క్రీన్‌పైన మాత్రమే కాదు ఆయన లోపాలు ఉన్న వ్యక్తి యొక్క మ్యాజిక్ ను చూస్తూ పెరిగాను. ఈ అద్భుతమైన ఫిల్మ్ ఎన్‌సైక్లోపీడియాను కలవడం నిజంగా అదృష్టం. ఇప్పటివరకు నా జీవితంలో గొప్ప సంఘటన అంటే ఇదే. అతనిని నా ఎదురుగా చూడగానే నాకు వణుకు పుట్టింది. ఈ భావన నాకు ఎంతో అద్భుతంగా ఉంది. లవ్ యూ సార్. నా బకెట్ జాబితాలో మరో టిక్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. నిజమైన ఫ్యాన్ మూమెంట్ అంటే ఇదే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.