సాధారణంగా సీజన్లను బట్టి కొన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి జబ్బులను నిర్లక్ష్యం చేస్తే.. ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏడాదిలో ఒకటి రెండు సార్లు అయినా పొడి దగ్గుతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది సాధారణంగా వచ్చే సమస్య. కాని దానికి దూరం చేసుకునేందుకు కొన్ని సూత్రాలు పాటించాలని ఆరోగ్య నిఫుణులు చెబుతున్నారు. దగ్గు ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. చాలా మంది దగ్గుకు సిరప్ లు వాడుతూ.. తినకూడని ఆహార పదార్థాలు తింటుంటారు. దీంతో దగ్గు తగ్గక పోగా.. పెరిగే అవకాశం ఉంటుంది.
READ MORE:CM YS Jagan: మేనిఫెస్టో అంటే ఒక చెత్త ముక్క కాదు.. పవిత్ర గ్రంథం..
దగ్గుతో బాధపడుతున్న వాళ్లు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. దగ్గు అధికంగా ఉన్నప్పుడు ఉప్పు అధికంగా వేసిన ఆహారాలను దూరం పెట్టండి. నూనె అధికంగా ఉన్న, నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకూడదు. ఉదాహరణకు పూరీలు, గారెలు వంటివి. పంచదారతో కూడిన ఆహార పదార్థాలను సైతం అవాయిడ్ చేయాలి. ఇది రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఏదైనా జబ్బు త్వరగా తగ్గలంటే రోగనిరోధక శక్తి తప్పనిసరి. పైన వివరించిన ఆహార పదార్థాలను దగ్గుతో బాధ పడుతున్న వాళ్లు తింటే.. కఫం అధికంగా ఉత్పత్తి అవుతుంది. అలాగే దగ్గు ఉన్నప్పుడు బెల్లంతో చేసిన ఆహారాలు, చల్లగా ఉండే నీరు, పెరుగు వంటివి కూడా తినడం మానేయాలి. అలాగే పండ్ల రసాలను దూరంగా పెట్టాలి. చల్లగా ఉండే పండ్ల రసాలు దగ్గును పెంచేస్తాయి. పరగడుపున గోరువెచ్చగా ఉన్న నీటిలో తేనె కలుపుకొని తాగితే చాలా మంచిది. ఒకవేళ పండ్ల రసాలు తాగినా కూడా చల్లగా కాకుండా, గది ఉష్ణోగ్రత వద్ద ఉండేట్టు చూసుకోవాలి. తేనె మాత్రం వేసుకొని తాగితే ఎంతో మంచిది.
రాత్రి అవుతున్న కొద్దీ దగ్గు మరింతగా పెరుగుతుంది. అలాంటప్పుడు ఉడికించిన ఆహార పదార్థాలను తినాలి. నూనెకు బదులు నీళ్లు పోసి వండిన కూరలు, అన్నం వంటివి తింటే మంచిది. అలాగే మసాలాలు అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. పండ్లను తినడం వల్ల మేలు జరుగుతుంది. కానీ సాయంత్రం ఏడు గంటలలోపే పండ్లను తినడం మంచిది. అది కూడా చల్లగా ఉన్న పండ్లను తినకూడదు. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న వంటలను మాత్రమే ఎంపిక చేసుకొని తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే దగ్గు నుంచి త్వరగా ఉపశమణం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నూనె అధికంగా ఉన్న పదార్థాల జోలికి వెళ్లకూడదు.