Cucumber: కీరదోసకాయతో మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో ప్రయోజనాలున్నాయి. దానితో పాటు మన చర్మానికి కూడా మంచిగా పనిచేస్తుంది. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలు, మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ లు కూడా ఉండటంతో.. కాలుష్య కారకాలకు వ్యతిరేకంగా చర్మాన్ని రక్షిస్తుంది. కీరదోస తింటే మీ చర్మం యువ్వనంగా, ధృడంగా కనిపించేలా చేస్తాయి.
Read Also: Kaleshwaram Project : కాళేశ్వరం ప్యాకేజీ 9లో సెకండ్ పంప్ ట్రయల్ రన్ విజయవంతం
కీర దోసలో ఎక్కువగా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మంలో వచ్చే వాపులను తగ్గించడానికి ఎంతగానో సహాయపడుతుంది. కీరదోసల్లో ఉండే లక్షణమేంటంటే.. ముఖంపై ఉన్న జిడ్డును, ఆయిలీ ఫేస్ ను తగ్గించి మృదువుగా చేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ అంతేకాకుండా కాలుష్యం కారణంగా ఫ్రీ రాడికల్స్ తో మన చర్మం జిడ్డుగా కనిపిస్తుంది. దీని ప్రభావంతో మానవుని డీఎన్ఎకు హాని కలిగిస్తాయి. అంతేకాకుండా మన చర్మంలోని కణాలకు హాని కలిగిస్తాయి. అప్పుడు దోసకాయలలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొని.. మన చర్మాన్ని రక్షిస్తాయి.
Read Also: Indian Student Rape: యూకేలో ఓ మహిళపై భారతీయ విద్యార్థి అత్యాచారం.. 6 ఏళ్ల జైలుశిక్ష..!
2010 అధ్యయనం ప్రకారం.. దోసకాయలలో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు ఉంటాయి. టానిన్లు ఒక రకమైన సహజ ఆస్ట్రింజెంట్. ఇది చర్మం కింద అదనపు ద్రవాన్ని పంపిణీ చేయడంలో సహాయపడుతుంది. ఇది ఉబ్బిన, కళ్ల వాపును తగ్గిస్తుంది. అంతేకాకుండా మన చర్మం నూనెను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని దోసకాయ ద్వారా నియంత్రించొచ్చు. మీ చర్మంపై రంధ్రాలను సంకోచించేలా చేస్తుంది. చర్మం నిగనిగ, ప్రకాశవంతంగా మెరవడానికి కీరదోసకాయ ఎంతో సహాయపడుతుంది. కీరదోసకాయలో ఉండే సిలికా అనే ఖనిజం బంధన కణజాలాలను బలోపేతం చేసి చర్మానికి తక్షణ మెరుపును ఇస్తుంది.