Here is List of Foods to Increase Blood: ‘రక్తం’ మన శరీరంలోని ప్రధాన వ్యవస్థ మాత్రమే కాకుండా.. చాలా ముఖ్యమైనది కూడా. ఆరోగ్యవంతమైన మనిషి శరీరంలో 5-6 లీటర్ల రక్తం ఉండాలి. శరీరం మొత్తం బరువులో రక్తం బరువు 8 శాతం వరకు ఉండాలంటారు. శరీరంలో రక్తం లేకపోవడం వల్ల అనేక వ్యాధులు చుట్టుముట్టవచ్చు. శరీరంలో రక్తం లేనట్లయితే ఓ వ్యక్తి కొంతకాలానికి చనిపోయే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే అసలు చింతించాల్సిన అసవరం లేదు. రక్తంను (Natural Way to Increase Blood) చాలా మార్గాల్లో పెంచుకోవచ్చు.
రక్త హీనత కారణంగా మనిషి చాలా బలహీనంగా కనిపిస్తాడు. ఎప్పుడూ అలసటగా ఉంటుంది. తరచూ తలనొప్పి, కళ్లు తిరగడం, మైకం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ఐరన్ లోపం ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఇందుకోసం ప్రతి సారి డాక్టర్స్ వద్దకు వెళ్లాల్సిన అవసరం ఏమాత్రం లేదు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారం తీసుకుంటే.. రక్తం బాగా పెరుగుతుంది. ఆ ఫుడ్స్ (How to Increase Haemoglobin) ఏంటో తెలుసుకుందామా.
బీట్‌రూట్ రసం:
బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల మీకు మేలు జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, పొటాషియం వంటివి శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తాయి.
ప్లం జ్యూస్:
మీరు సహజ పద్ధతిలో శరీరంలో రక్తాన్ని పెంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ ఎండిన ప్లం జ్యూస్ తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపున ఈ జ్యూస్ తీసుకోవచ్చు.
యాపిల్ జ్యూస్:
రోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు వెళ్లాల్సిన పనే ఉండదని అంటుంటారు. యాపిల్‌తో అన్ని లాభాలున్నాయి మరి. మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడంతో పాటు రక్తంలో హిమోగ్లోబిన్ పెంచుతుంది. యాపిల్ జ్యూస్ తాగినా మంచిదే.
గ్రీన్ జ్యూస్:
గ్రీన్ జ్యూస్ మీ శరీరానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది పాలకూర, బీట్‌రూట్ వంటి కూరగాయలతో తయారు చేయబడుతుంది. మీ శరీరంలో రక్తం తక్కువగా ఉన్నట్లయితే మీరు ప్రతిరోజూ ఈ జ్యూస్‌ను తీసుకోవాలి. ఇందులో ఐరన్ సహా ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాపర్ ఉంటాయి. ఇది మీ శరీరంలో రక్తాన్ని వేగంగా పెంచుతుంది.
దానిమ్మ మరియు ఖర్జూర రసం:
దానిమ్మ మరియు ఖర్జూర రసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండింటిలో ఐరన్ మరియు విటమిన్ సి ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే రక్తహీనత దూరమవుతుంది.
డ్రై ఫ్రూట్స్:
వాల్‌నట్, బాదం మొదలైన డ్రై ఫ్రూట్స్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. వీటి వలన రక్తంలో ఎర్ర రక్త కణాలు వేగంగా పెరుగుతాయి. బచ్చలికూర, పాలకూరలో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.
Also Read: ODI World Cup 2023: భారత అభిమానులకు శుభవార్త.. టీమిండియాలోకి ఎంఎస్ ధోనీ ఎంట్రీ!