Top 10 List of Fastest Centuries in ODI: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో జింబాబ్వే ఆటగాళ్లు సెంచరీలతో చెలరేగుతున్నారు. ఈ క్రమంలోనే ఆల్‌రౌండర్ సికందర్ రజా వన్డే క్రికెట్‌లో జింబాబ్వే తరపున అత్యంత వేగంగా సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా మంగళవారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రజా 54 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు సీన్ విలియమ్స్ పేరిట ఉంది. రెండు రోజుల క్రితం (2023 జూన్ 18) నేపాల్‌పై విలియమ్స్ 70 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు విలియమ్స్ పేరుపై 2 రోజులే ఉండడం విశేషం.
అయితే వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రికార్డు (Fastest ODI Century) దక్షిణాఫ్రికా దిగ్గజం, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ పేరిట ఉంది. 2015లో వెస్టిండీస్‌పై ఏబీ కేవలం 31 బంతుల్లోనే శతకం బాదాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దరిదాపుల్లోకి కూడా ఎవరూ రాలేదు. ఈ జాబితాలో న్యూసుజలాండ్ ప్లేయర్ కోరీ అండర్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. 2014లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో అండర్సన్ 36 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 1996లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ మాజీ బ్యాటర్ షాహిద్ అఫ్రిది 37 బంతుల్లోనే సెంచరీ బాది మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read: Telangana Rains: పలుకరించిన తొలకరి.. నేడు, రేపు వర్షాలు
1999లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా కేవలం 45 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దాంతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ చేసిన నాలుగో ఆటగాడిగా ఉన్నాడు. 2015లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ 46 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేసి టాప్ 5లో ఉన్నాడు. టాప్ 5లో ఒక్క భారత బ్యాటర్ కూడా లేడు. ఇక టాప్ 10లో భారత్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 51 బంతుల్లోనే సెంచరీ చేసి 9వ స్థానంలో ఉన్నాడు.
ఫాస్టెస్ట్ సెంచరీ లిస్ట్ (Fastest ODI Hundred List):
ఏబీ డివిలియర్స్ – 31 బంతులు
కోరీ అండర్సన్ – 36 బంతులు
షాహిద్ అఫ్రిది – 37 బంతులు
బ్రియాన్ లారా – 45 బంతులు
జోస్ బట్లర్ – 46 బంతులు
సనత్ జయసూర్య – 48 బంతులు
కెవిన్ ఓబ్రెయిన్ – 50 బంతులు
గ్లెన్ మాక్స్ వెల్ – 51 బంతులు
విరాట్ కోహ్లీ – 51 బంతులు
సికిందర్ రాజా – 54 బంతులు
Also Read: Ashada Bonalu 2023: నేటినుంచే ఆషాడ బోనాలు షురూ.. గోల్కొండ అమ్మవారికి తొలి బోనం!