సంతానలేమి ఉండటానికి ఆడవాళ్లలో సమస్యలు ఉండటం ఎంత ముఖ్య కారణమో, మగవాళ్లలో సమస్యలు కూడా అంతే ప్రధాన కారణం. సంతానలేమికి గల కారణాల్లో 30 శాతం పురుషులే కారణం. పురుషుల్లో ఇన్ ఫర్టిలిటీ ఉండటానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. ఒకటి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం లేక, వాటి నాణ్యత, చలనంలో సమస్యలుండటం. రెండు లైంగిక కలయికలోనే ఇబ్బంది ఉండటం. స్తంభన సమస్యలు (ఎరికల్ డిస్ ఫంక్షన్) ఉండటం. అందుకే మీ సమస్య ఉన్న అంట వచ్చినప్పుడు ఆడవాళ్లతో పాటు మగవాళ్ల హెల్త్ ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందు సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది చూడాలి. స్థూలకాయం, మధుమేహం లాంటి సమస్యలున్నవాళ్లలో లైంగిక సమస్యలు ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. మధుమేహుల్లో ఎరెస్టైల్ డిస్ ఫంక్షన్ ఎజాక్యులేటరీ సమస్యలు ఉండవచ్చు. ఇలాంటి సమస్యలు ఏవీ లేవని తేలినప్పుడు సమన్ టెస్ట్ చేస్తాడు. ఈ పరీక్ష ద్వారా సెమన్ (వీర్యం)లో శుక్రకణాలు (స్పెర్మ్స్ ) ఎలా ఉన్నాయో తెలుసుకుంటారు. వీర్యకణాల సంఖ్య ఒక మిల్లీలీటర్ వీర్యానికి 16 మిలియన్లు ఉండాలి. అంతకన్నా తక్కువ సంఖ్యలో వీర్య కణాలు ఉంటే అలిగేజు స్మరియా అంటారు. అసలు వీర్యకణాలే లేకపోతే ఆజస్మెర్మియా అంటారు.
కొన్నిసార్లు వీర్యకణాల సంఖ్య సరైన మోతాదులో ఉన్నప్పటికీ ఫెర్టిలిటీ సమస్య ఉంటుంది. ఇందుకు కారణం వీర్యకణాల్లో నాణ్యత లోపించడం. సంఖ్య ఉంటే సరిపోదు. వాటి నిర్మాణం, చురుకుదనం, మొబిలిటీ లాంటివి కూడా సరిగ్గా ఉండాలి.
వీర్యకణాల సమస్య ఎందుకు?
– వీర్యకణాల ఉత్పత్తి లేకపోవటానికి ‘నాన్ అబ్స్ట్రక్షన్ అజూస్పెర్మియా ’ లేక ‘అబ్స్ట్రక్షన్ అజూస్పెర్మియా’ గానీ కారణమవుతాయి.
– వృషణాల్లో ఉత్పత్తయిన వీర్యకణాలు వాస్ డిపరెస్సీ (శుక్ల వాహిక) ద్వారా వీర్యం లోకి చేరుతాయి. ఈ వాస్ డిఫరెన్సీ నాళంలో ఏమైనా అడ్డంకులు ఉన్నప్పుడు వీర్యకణాలు వీర్యం లోకి చెంలేవు. దీన్ని అబ్ స్ట్రక్టివ్ ఆజస్మర్మియా’ అంటారు. ఇలాంటప్పుడు వీర్యకణాల ఉత్పత్తిలో సమస్య లేకపోయినప్పటికీ అవి, నిర్మల లోకి చెంగకపోవడం వల్ల సంతానం కలుగదు.. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఈ సమస్యను గుర్తించవచ్చు.
– కొందరిలో జన్యుపరమైన సమస్యల వల్ల కూడా వీర్యకణాల ఉత్పత్తి ఉండదు. పై క్రోమోజోమ్ లో మైక్రోడిలీషన్ వల్ల క్షేమోటోమ్ లో లోపం ఏర్పడుతుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఇలాంటి అన్యు సమస్య ఏర్పడొచ్చు. కొందరిలో ఈ జన్యులోపం వాళ్లలోనే మొదట మొదలవ్వొచ్చు.
– లైంగిక హార్మోన్ల ఉత్పత్తి యాక్టివేట్ కావాలంటే పిట్యుటరీ గ్రంధి నుంచి ఫోలికిల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (ఎస్ ఎస్ హెచ్) ట్యుటినైజింగ్ హార్మోన్ (ఎల్ హెచ్) సరిగ్గా ఉండాలి. వీటి ఉత్పత్తిలో తేడా ఉంటి లైంగిక హార్మోన్లలో సమస్య వస్తుంది. పురుషుల్లో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి కుంటుపడుతుంది. అందువల్ల సంతానలేమి సమస్యకు దారితీస్తుంది ఈ సమస్యను హైపోగొనాడోట్రోఫిక్ హైపోగొనాడిజమ్’ అంటారు. -కీమోథెరపీ లాంటి క్యాన్సర్ చికిత్సలు తీసుకున్నవాళ్లలో, వేరికోసిల్ సమస్య ఉన్న వాళ్లలో గవదబిళ్లలు (మం) వ్యాధి వచ్చినవాళ్లలో వృషణాలు కూడా ఇన్ ఫెక్ట్ కావడం వల్ల కూడా స్మెర్మ్ కౌంట్ దెబ్బతింటుంది.
-మరికొందరిలో అంటే ఒక 20 నుంచి 30 శాతం మందిలో కారణం ఏంటో తెలియకుండా ఇన్ ఫర్టిలిటీ ఉంటుంది.
పరిష్కారం :
– అబ్స్ట్రక్షన్ అజూస్పెర్మియా ఉన్నవాళ్లకు టీసా (టిఇఎస్ ఏ) లేదా సీసా (పిఎస్ ఎ) ద్వారా నీడిల్ ని డైరెక్ట్ గా లోపలికి పించి వీర్యకణాలను వృషణాల నుంచి సేకరిస్తారు. తర్వాత అసిస్టర్ రిడక్షన్ టెక్నిక్స్ ద్వారా అందంతో ఫలరీకరణం చెందిస్తారు.
– పిట్యుటరీలో సమస్య స నిర్మకణాల లోపం ఉన్న వాళ్లకు మూడు నెలల పాటు హార్మోన్ ఇంటికన్లు ఇస్తే నిర్మకణాల ఉత్పత్తి స్థూలకాయం ఉన్నవాళ్లలో కొవ్వులోని టాప్ గా మారుతుంది. ఈ రెండు హార్మోన్ల మధ్య నిష్పత్తి 1:50 కి చేరిత దీన్ని ఆపడానికి మందులు ఇస్తాడు. వీర్యకణాలు ఉత్పత్తి కావడానికి 72 రోజులు పడుతుంది. అందువల్ల ఈ మందులు తీసుకున్న 3 నుంచి 5 రోజుల వరకు లైంగిక కలయికలో పాల్గొనవద్దని చెబుతారు. ఆ తర్వాత వీర్యాన్ని సేకరించి టెస్ట్ చేస్తారు. వీర్యకణాలను తీసుకుని IVF ద్వారా సంతాన పాపల్యం పొందవచ్చు.
నివారణ :
ఇన్ ఫెర్టిలిటీ సమస్య రావడానికి మారిన జీవనశైలే ప్రధాన కారణం.అందుకే జంక్ జంక్‌ఫుడ్ లాంటి వాటిజోలికిపో కుండా మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవడంతో పాటు, దురలవాట్లకు దూరంగా ఉండాలి. సిగరెట్లు, ఆల్కహాల్ ముట్టుకోవద్దు. కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తపడాలి. అధిక ఒత్తిడి, తగినంత నిద్రలేకపోవడం, అధిక వేడికి ఎక్పోస్ కావడం వీర్య కణాల సంఖ్య తగ్గడానికి దోహదపడతాయి. బిగుతుగా ఉండే దుస్తులు ధరించటం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంటుంది. కొందరు బాడీలో మజిల్ మాస్‌ని పెంచడానికి స్టెరాయిడ్స్ తీసుకుంటుంటారు. వీళ్లలో పిట్యూటరీ హార్మోన్లు దెబ్బతింటాయి. అందుకే ఇది మంచిది కాదు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తపడితే ఫెర్టిలిటీ సమస్యలని నివారించొచ్చు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా సమస్యలని అధిగమించొచ్చు.
డాక్టర్ ప్రీతి రెడ్డి
ఇన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్
Phone : 8882 046 046, 78420-42028
www.rainbowhospitals.in
బర్త్ రైట్ రెయిన్ బో హాస్పిటల్స్
హైదరాబాద్