Health: వేసవిలో సూపర్‌ఫుడ్.. ఇది తింటే ఎన్ని ప్రయోజనాలంటే..?
- ఎండ కాలంలో దోసకాయ సలాడ్ సూపర్ ఫుడ్
- ఎండా కాలంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి వచ్చిదంటే చాలు ఎండలకు భయపడి బయటకు పోవాలంటే నరకం కనపడుతుంది. కొద్దిసేపు ఎండకు తిరగారంటే చాలు శరీరం అలసిపోతుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి జలదాహం, నీరసం, అలసట, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. ఈ క్రమంలో శరీరాన్ని చల్లగా ఉంచే, హైడ్రేటెడ్‌గా నిలిపే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. దోసకాయ సలాడ్ ఎండ కాలంలో అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఎండా కాలంలో ప్రతిరోజూ దోసకాయ తినడం వల్ల ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Read Also: US: అమెరికాలో చదువుతున్న వారికి షాక్.. దేశం వదిలి వెళ్లాలంటూ ఈమెయిల్స్.. కారణం ఏమిటి..?
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
1. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది:
వేసవిలో అధిక చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల నిర్జలీకరణ, బలహీనత, తలనొప్పి వంటి సమస్యలు ఏర్పడతాయి. దోసకాయలో 95 శాతం నీరు ఉండటం వల్ల.. ఇది శరీరాన్ని తక్కువ సమయంలోనే హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. రోజూ దోసకాయ తినడం వల్ల శరీరానికి తాజాదనం పెరుగుతుంది, అలసట తగ్గుతుంది.
2. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది:
మెరిసే చర్మాన్ని కోరుకునే వారికి దోసకాయ అద్భుతంగా పని చేస్తుంది. దీనిలో ఉండే.. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. మొటిమలు, మచ్చలు తగ్గి, చర్మం సహజంగా మెరుస్తుంది. వేసవిలో ఎక్కువగా ఉండే తాప ఉష్ణోగ్రత ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
3. బరువు తగ్గడానికి సహాయపడుతుంది:
బరువు తగ్గాలనుకునే వారికి దోసకాయ సలాడ్ ఉత్తమమైన ఎంపిక. ఇది తక్కువ కేలరీలు కలిగి ఉంటుంది, కానీ ఫైబర్ అధికంగా ఉంటుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. భోజనానంతరం కడుపుని ఎక్కువ సేపు నిండుగా ఉంచడం ద్వారా ఆకలి నియంత్రణలో ఉంటుంది. వెల్లుల్లి, నిమ్మకాయ, పెరుగు వంటి పదార్థాలతో కలిసి తీసుకుంటే బరువు తగ్గవచ్చు.
4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
వేసవిలో చాలా మందికి అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దోసకాయలో ఉన్న ఫైబర్ ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఇది ఆమ్లత్వం తగ్గించి, గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. రోజూ తినడం వల్ల కడుపు సమస్యలు తక్కువగా ఉంటాయి.
5. శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది:
ఎండ వేడిమి వల్ల అలసట, తలనొప్పి, ఒంటిలో మండడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. దోసకాయ శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్ ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. వేసవిలో ఎక్కువగా ఎండలో తిరిగే వారు తప్పకుండా దోసకాయను ఆహారంలో చేర్చుకోవాలి.
6. శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది:
దోసకాయలో నిర్విషీకరణ (డీటాక్స్) గుణాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపి ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకుండా.. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతూ, మూత్ర విసర్జనను మెరుగుపరచుతుంది. ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.
7. రక్తపోటును నియంత్రిస్తుంది:
రక్తపోటు ఎక్కువగా ఉండే వారు దోసకాయను తప్పక తినాలి. ఇందులో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండటంతో రక్తపోటును సమతుల్యం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి, హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తుంది. స్ట్రోక్ ముప్పును తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.
దోసకాయను ఎలా తినాలి..?
దోసకాయను వివిధ రకాల్లో తినవచ్చు. అయితే, పచ్చిగా తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి.
సింపుల్ సలాడ్ – దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, నిమ్మరసం వేసుకుని తినవచ్చు.
రైతా – తురిమిన దోసకాయను పెరుగులో కలిపి తినడం ఉత్తమం.
డీటాక్స్ వాటర్ – దోసకాయ ముక్కలను నీటిలో వేసి, ఆ నీటిని త్రాగితే శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది.
శాండ్‌విచ్‌లు, రోల్స్ – ఆరోగ్యకరమైన చిరుతిండిగా ఉపయోగించవచ్చు.
తాజావార్తలు
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!