ఉగాది పర్వదినం సందర్భంగా ZEE5 తన ప్రేక్షకులకు రెట్టింపు సంతోషాన్ని అందించిన విషయం తెలిసిందే. ZEE5లో ఇటీవల విడుదలైన కుటుంబ వినోద చిత్రం ‘మజాకా’ 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను దాటి సత్తా చాటింది. ‘మజాకా’ ఇప్పుడు అగ్రస్థానంలో విజయవంతంగా ట్రెండ్ అవుతోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అందరి మనసులను కట్టిపడేస్తోంది. హాస్యం, ప్రేమ, తండ్రి-కొడుకుల భావోద్వేగాలు—ఇలా అన్ని అంశాలను కలగలిపి తెరకెక్కిన ‘మజాకా’ ఓటీటీ ప్రేక్షకులను ఆనందపరుస్తోంది. రావు రమేష్, సందీప్ కిషన్ జోడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. తండ్రి-కొడుకులుగా నవ్వులు పూయిస్తూ, కన్నీళ్లు తెప్పించే విధంగా వారి నటన అందరినీ మెప్పిస్తోంది. ‘మజాకా’లో హాస్యంతో పాటు ఓ చక్కని సందేశాన్ని కూడా అందించారు. ఇటీవల విడుదలైన ‘రఘు తాత’, , ‘విమానం’ వంటి సినిమాలు హాస్యంతో కూడిన కుటుంబ భావోద్వేగాలను పంచాయి. ఇప్పుడు ‘మజాకా’ కూడా ZEE5 వీక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా ZEE5లో SVOD సౌత్ విభాగం ఉపాధ్యక్షుడు లాయిడ్ జేవియర్ మాట్లాడుతూ, “ప్రాంతీయ సినిమాల్లో ‘మజాకా’ ఇప్పుడు ZEE5లో హవాను చూపిస్తోంది. తెలుగు సినిమాల్లో కొత్త రికార్డు సృష్టించిన ‘మజాకా’ ఘన విజయంతో మేము ఎంతో సంతోషిస్తున్నాము. రావు రమేష్, సందీప్ కిషన్ జంటను అందరూ ఆదరిస్తున్నారు. తండ్రి-కొడుకులుగా వారి అద్భుత నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ విజయం మా వీక్షకులకు నాణ్యమైన కంటెంట్ అందించాలనే ZEE5 సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది” అని తెలిపారు.
రావు రమేష్ మాట్లాడుతూ, “‘మజాకా’కు వస్తున్న అద్భుతమైన ఆదరణ చూసి నేను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. ప్రేమ, హాస్యం, కుటుంబ వినోదంతో నిండిన ఈ చిత్రాన్ని ZEE5లో ప్రేక్షకులు ఇంతగా ఆస్వాదిస్తుండటం చూస్తే ఆనందంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న సానుకూల స్పందనలు హర్షం కలిగిస్తున్నాయి. ఇలాంటి అద్భుతమైన సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఎప్పటికీ కృతజ్ఞుడిని” అని అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ, “డిజిటల్ వేదికల్లో ‘మజాకా’కు లభిస్తున్న అపూర్వ స్పందన చూసి ఎంతో ఆనందంగా ఉంది. సామాన్యుడిలా కనిపించే కృష్ణ పాత్రను పోషించడం ఒక సవాలుగా అనిపించినప్పటికీ, అలాంటి పాత్రలో నటించడం సంతోషాన్నిచ్చింది. ‘మజాకా’ అద్భుతమైన వినోదాన్ని అందించే చిత్రం. హాస్యంతో పాటు కుటుంబ భావోద్వేగాలను చూపే ఈ సినిమాకు ఇంతటి ఆదరణ రావడం ఆనందదాయకం. మా చిత్రాన్ని ఇష్టపడుతున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు” అని చెప్పారు.