Health Tips: నెల పాటు ప్రతిరోజూ 20 పుష్-అప్‌లతో శరీరంలో అద్భుతమైన మార్పులు..
- ప్రతిరోజూ కేవలం 20 పుష్-అప్లు
- శరీరంలో అద్భుతమైన మార్పులు
- మీ శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కండరాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతి రోజు వ్యాయామం చేయాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధపెరగడంతో చాలామంది వ్యాయామం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే జిమ్‌కు వెళ్లడానికి లేదా భారీ వ్యాయామాలు చేయడానికి సమయం దొరకకపోతే, పుష్-అప్లు బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. ప్రతిరోజూ కేవలం 20 పుష్-అప్లు చేయడం ద్వారా శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయంటున్నారు నిపుణులు. ఈ వ్యాయామం మీ శరీరాన్ని బలోపేతం చేయడమే కాకుండా, కండరాలు, జీవక్రియను మెరుగుపరుస్తుంది. మీరు ఒక నెల పాటు ప్రతి ఉదయం 20 పుష్-అప్లు చేయడం అలవాటు చేసుకుంటే, మొదటి వారం నుండే మీరు 5 అద్భుతమైన మార్పులను చూస్తారు.
Also Read:Hamas: నిరసనలకు భయపడి సొంత ప్రజల్ని చంపేస్తున్న ‘‘హమాస్’’
Also Read
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
- క్యాబ్ డ్రైవర్ ముసుగులో మిక్సింగ్ లిక్కర్ దందా.. ఇద్దరి అరెస్ట్.!
- Sammakka Sagar Barrage: సమ్మక్క సాగర్ బ్యారేజీకి త్వరలోనే ఎన్ఓసీ.. సీఎం రేవంత్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం హామీ..!
కండరాలు దృఢంగా..
రోజూ పుష్-అప్స్ చేయడం వల్ల మీ కండరాలు బలపడతాయి. ముఖ్యంగా ఛాతీ, భుజాలు, వీపు, చేతులు దృఢంగా మారుతాయి. క్రమం తప్పకుండా 20 పుష్-అప్లు చేసినప్పుడు శరీరం క్రమంగా బలంగా మారుతుంది. దీని కారణంగా మీరు రోజంతా మరింత చురుకుగా, ఎనర్జిటిక్ గా ఉంటారు. జిమ్‌కి వెళ్లకుండానే మీ శరీరం ఫిట్‌గా, టోన్గా కనిపించాలంటే, పుష్-అప్లు మీకు ఉత్తమ వ్యాయామం. ఇది ఛాతీ, భుజాలు, ట్రైసెప్స్, బైసెప్స్ మరియు కోర్ కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది. వెన్నెముక, ఉదర కండరాలను బలపరుస్తుంది.
Also Read:Uttam Kumar Reddy : తెలంగాణ కేబినెట్ విస్తరణ.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
పొట్ట దగ్గర కొవ్వు తగ్గుతుంది
పొట్ట దగ్గర కొవ్వు తగ్గించుకోవాలనుకుంటే, పుష్-అప్లు మీకు సహాయపడతాయి. ఇది కడుపు, భుజాలు, నడుము వద్ద కొవ్వును వేగంగా తగ్గించడంలో సహాయపడుతుంది. పుష్-అప్స్ చేయడం వల్ల శరీర జీవక్రియ పెరుగుతుంది. ఇది కొవ్వును వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది. సరైన ఆహారం, తేలికపాటి కార్డియో వ్యాయామాలతో కలిపితే, బరువు తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడైంది.
గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
పుష్-అప్లు మీ కండరాలను బలోపేతం చేయడమే కాకుండా, మీ గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. మీరు పుష్-అప్స్ చేసినప్పుడు, శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. పుష్-అప్స్ చేయడం వల్ల ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి మిమ్మల్ని సంతోషంగా, శక్తివంతంగా ఉంచుతాయి. ఇది ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలతో పోరాడటానికి సహాయపడుతుంది.
ప్రతిరోజూ 20 పుష్-అప్లు ఎలా చేయాలి?
మీకు పుష్-అప్స్ చేసే అలవాటు లేకపోతే, ప్రారంభంలో కష్టంగా ఉండవచ్చు. కానీ అలవాటు పడిన కొద్దీ సులభం అవుతుంది.
మొదటి రోజు 5-10 పుష్-అప్‌లతో ప్రారంభించండి. ఆపై ప్రతిరోజూ 1-2 పెంచండి.
పుష్-అప్స్ చేస్తున్నప్పుడు, శరీరాన్ని నిటారుగా ఉంచి, చేతులను 90 డిగ్రీల కోణంలో వంచండి.
క్రిందికి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోండి, పైకి వచ్చేటప్పుడు గాలిని వదలండి.
మీరు 20 పుష్-అప్‌లను నేరుగా చేయడం కష్టంగా అనిపిస్తే, వాటిని ఒక్కొక్కటి 10 చొప్పున 2 సెట్లలో చేయండి.
తాజావార్తలు
-
Ramya Krishna : పెళ్లి వద్దన్నారు, విని ఉంటే బాగుండేదనిపిస్తోంది.. విడాకుల వార్తలపై రమ్యకృష్ణ షాకింగ్ కామెంట్స్
-
Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
-
Dhanush : ‘పొగరు’ అన్న ట్రోల్స్‌కు ధనుష్ కౌంటర్.. అసలు నిజం చెప్పి షాకిచ్చిన స్టార్ హీరో!
-
IPL Retentions 2027: నరైన్ కోసం టాప్ ట్రేడ్.. ఆర్ఆర్ ఆఫర్‌ను తిరస్కరించిన కేకేఆర్!
-
Missile Attack on LPG Tanker: హార్మూజ్ జలసంధిలో గ్యాస్ ట్యాంకర్‌పై క్షిపణి దాడి.. నౌకలో 24 మంది భారతీయులు..!
ట్రెండింగ్
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!
-
IPL 2027 రిటెన్షన్లకు నేడే చివరి గడువు.. ఇప్పటి వరకు జరిగిన ట్రేడ్స్ లిస్ట్ ఇదిగో..