Acidity: అసిడిటీ ఎవరినీ ప్రశాంతంగా ఉంచదు. ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత గుండెల్లో మంట, చికాకు, ఇలా గుండెల్లో మంట ఉంటే అది ఖచ్చతంగా ఎసిడిటీనే. జీర్ణవ్యవస్థ సరిగా లేకుంటే కడుపు మంటగా అనిపిస్తుంది. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ మంట ఏమీ తిననివ్వదు.. తింటే సహించదు. అయితే, ఈ సమస్యకు చాలా కారణాలు ఉన్నాయి. చాలా మంది కడుపు మంటను తగ్గించడానికి లేనిపోని టాబ్లెట్లు, సిరప్‌లను ఉపయోగిస్తారు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినవైతే పర్వాలేదు కానీ.. మందుల షాపులో అడిగి ఏదైనా కొని వాడుకోవడం సరికాదు. అంతేకాదు.. ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందేందుకు చాలా హోం రెమెడీస్ ఉన్నాయి. దీని నుంచి బయట పడటానికి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Read also: Nandakumar Released: జైలు నుంచి విడుదలైన నందకుమార్.. షరతులతో కూడిన బెయిల్
ఇలా చేస్తే తక్షణ ఉపశమనం..
* ఒక కప్పు గోరు నీటిలో కొద్దిగా వాము పొడి, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి తీసుకోవచ్చు. దీన్ని రోజుకు రెండుసార్లు తాగితే కడుపు మంట నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
* రెండు టీస్పూన్ల తేనెను గోరువచ్చని నీటిలో కలిపి ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు తీసుకుంటే గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. తేనె సహజసిద్ధమైన యాంటాసిడ్‌గా పనిచేస్తుంది. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది.
Read also: Bet Hens: ఉడుతలపల్లి కోడి ధర రూ.70 వేలకు పైనే.. బరిలోకి దిగాయంటే..
* ఒక గ్లాసు నీటిలో రెండు టీస్పూన్ల జీలకర్ర వేసి పది నిమిషాలు మరిగించి, వడకట్టి చల్లారాక తాగాలి. ఈ నీటిని ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కడుపు మంట తగ్గుతుంది.
* రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు చల్లని పాలు తాగాలి. పాలను బాగా మరిగించి చల్లార్చి కాసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఆతరువాత వాటిని నిద్రించడానికి కొన్ని నిమిషాల ముందు తీసుకోవాలి. ఇలా వరుసగా మూడు రోజులు చేస్తే ఎసిడిటీ తగ్గుతుంది.
* ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు గుప్పెడు సోంపును నోట్లో వేసుకుని నమిలి మింగాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కడుపులో మంట నుండి ఉపశమనం కూడా లభిస్తుంది.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు