Bet Hens: సంకాంత్రి అంటేనే కోళ్ల పందాలకు ఫేమస్.. ఎంతో హుషారుగా యువతతో పాటు స్థానిక ప్రముఖులు ఈ పందేలలో పాల్గొంటుంటారు. అయితే సంక్రాంతి అంటే ఆంధ్రాలో కోళ్లు ప్రత్యేక స్థానం ఉంది. ఆంధ్రాలో జరిగే పందెంలో పాల్గొనే కోళ్లు నల్లగొండ జిల్లా చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామం నుంచే వెళ్తాయనే సంగతి మీకు తెలుసా? ఈవిషయం కొంత మందికి మాత్రమే తెలుసు. ఇది విన్న వారందరూ ఆశ్చర్యపోక తప్పదు. పందెం కోళ్ల పెంపకానికి ఉడుతపల్లి కేరాఫ్‌గా మారిందంటే నమ్మసక్యం కాదు. ఉడుతపల్లి కోళ్లు బరిలోకి దిగాయంటే ఆంధ్రాకోళ్లను చిత్తు చేసి పై చేయిగా నిలుస్తున్నాయంటూ పెంపకం దారులు చెబుతున్నారు. అయితే.. ఉడుతలపల్లిలో కోడి పందేలు జరుగకపోయినా ఇక్కడ పెంచిన కోళ్లను ఆంధ్రాకు విక్రయిస్తుంటారు పెంపకం దారులు.. ఇక్కడి నుంచి ఔత్సాహికులు వేల రూపాయిలు పెట్టి కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు.
Read also: Inavolu Mallanna Jatara: నేటి నుంచి మైలారు దేవుడి బ్రహ్మోత్సవాలు.. పెటెత్తిన భక్తులు
మరికొందరు గ్రామస్తులు ఇక్కడి కోళ్లను సంక్రాంతి వేళ ఆంధ్రా ప్రాంతానికి తీసుకెళ్లి విక్రయించడం.. పందెం కాయడం వంటివి చేస్తున్నారు. అయితే..ఇప్పటికే పలు కోళ్లను తరలించగా ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది పెంపకందారులు ఆంధ్రాకు తమ కోళ్లను తీసుకెళ్లనున్నారు. అయితే ఈకోట్లు ఎంత ధర పలుకుతుంది అనేప్రశ్నకు సమాధానం వింటే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.. ఎందుకంటే ఉడుతలపల్లి కోళ్లు రూ. 6 వేల నుంచి రూ.70 వేల వరకు ధర పలుకుతుంటాయి. ఉడుతలపల్లి గట్టి నేలలు ఉండటంతో పెరిగే నాటు కోళ్లు కూడా ధృడంగా ఉంటాయి. ఇక..ఆంధ్రాలో సారవంతమైన.. మృదువైన నేలలు ఉండటంతో అక్కడి వాటితో పోలిస్తే తెలంగాణ కోళ్లే గట్టిగా ఉంటాయని పెంపకం దారులు చెబుతున్నారు. బరిలోకి దిగాయంటే పోటీకి వచ్చిన ఏ కోళ్లైనా ఓడాల్సిందే.. అంటున్నారు. పందెంలో చురుగ్గా పాల్గొని ఉడుతలపల్లి కోళ్ల అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందుకే తెలంగాణ కోళ్లు అంటే అక్కడి వారు చాలా మక్కువ చూపిస్తుంటారని అంటున్నారు ఉడుతలపల్లి కోళ్ల పెంపకం దారులు. మరి మీరేమంటారు.
Top Headlines @9AM: టాప్ న్యూస్