Nandakumar Released: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల ఎర కేసు వ్యవహరంలో నిందితుడిగా ఉన్న నందకుమార్ ను గత నెలలో భూవివాదం కేసులో బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిదే.. అయితే ఇవాళ చంచల్ గూడ జైల్లో ఉన్న నందకుమార్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నందకుమార్ శుక్రవారం నాడు చంచల్ గూడ జైలు నుండి విడుదలయ్యాడు. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో నందకుమార్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే.
Read also:Bet Hens: ఉడుతలపల్లి కోడి ధర రూ.70 వేలకు పైనే.. బరిలోకి దిగాయంటే..
ఈ కేసులో నందకుమార్, రామచంద్రభారతి, సింహాయాజీల కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా.. భూ అక్రమ దందాలు చేస్తూ నందకుమార్ మధ్యవర్తిగా ఉండేవాడు. దీంతో బాదితుల ఫిర్యాదుతో గత నెలలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో అరెస్టైన నందకుమార్ కు ఇవాళ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అంతేకాకుండా..నందకుమార్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నగరం విడిచి వెళ్లొద్దని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా.. రూ.10 వేల చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దీంతో.. కోర్టు ఆదేశాల మేరకు పూచీకత్తులను సమర్పించడంతో చంచల్ గూడ జైలు నుండి నందకుమార్ ఇవాళ విడుదలయ్యాడు.
Top Headlines @9AM: టాప్ న్యూస్