గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. రోజూ ఒక గుడ్డు తింటే ఎన్నో ప్రోటీన్స్ అందుతాయని డాక్టర్స్ చెబుతున్నారు.. ఇందులో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ బి12, రిబోఫ్లేవిన్, సెలీనియయం, విటమిన్ డి, విటమిన్ ఇ, బి 6, కాల్షియం, జింక్ తగిన మోతాదులో ఉంటాయి.. అందుకే వీటిని రోజూ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.. అయితే రాత్రి పూట తినాలా? వద్దా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.. నిజానికి పగలు తినడం కన్నా రాత్రి తినడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల ముఖ్యమైన లాభాల్లో నిద్ర ఒకటి. ట్రిఫ్టోఫాన్ పుష్కలంగా ఉన్న గుడ్లని తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఈ ట్రిఫ్టోఫాన్ తీసుకోవడం వల్ల మనస్సుకి ప్రశాంతంగా ఉంచుతుంది. హార్మోన్ల సమస్యల్ని దూరం చేస్తుంది. వీటిలోని మెలటోనిన్ నరాల కణాల పనితీరుని మెరుగ్గా చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ కారణంగా హాయిగా నిద్రపడుతుంది..అయితే పడుకొనే ముందు రెండు గంటల ముందు వీటిని తీసుకోవడం మంచిది..
ఇకపోతే చాలా మంది బరువు తగ్గాలని చూస్తుంటారు. అలాంటి వారు గుడ్లు తినడం వల్ల అందులోని ప్రోటీన్ చాలా వరకూ ఆకలి కాకుండా చేస్తుంది. రాత్రుళ్ళు ఎక్కువ తినకుండా చేస్తుంది… దాంతో సులువుగా బరువు తగ్గుతారు..ప్రోటీన్ అనేది మీ కండరాలకు చాలా మంచిది. ఎగ్స్‌లోని ప్రోటీన్ హార్మోన్ల పనితీరుని బ్యాలెన్స్ చేస్తుంది. కండరాలను పెంచుకోవాలను కునేవారు రోజూ రెండు గుడ్లు తినడం మంచిది..ఇంకా కోడిగుడ్డులో ల్యూసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బలమైన అమైనో ఆమ్లం.. మెదడు పనితీరు, కంటి చూపు కూడా మెరుగుడుతుంది..ఇన్ని విన్నాక తినకుండా ఉంటారా… తినండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి…