health: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తుంది. వయసుతో సంభందం లేకుండా చాలా మంది వర్షాకాలాన్ని ఆస్వాదిస్తుంటారు. చల్లగా వర్షం పడుతుంటే ఒక కప్పు టీ లేదా కాఫీ సేవిస్తూ ఇష్టమైన వారితో కబుర్లు చెప్తూ వర్షాన్ని ఆస్వాదిస్తుంటే కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆనందాన్ని అందించే వర్షం వస్తూ వస్తూ అనారోగ్యాన్ని కూడా వెంటబెట్టుకుని వస్తుంది. వర్షాకాలంలో మనిషిలో వ్యాధినిరోధకశక్తి తగ్గుతుంది. అందువల్ల జ్వరం, జలుబు, దగ్గు, అలెర్జీ వంటి వ్యాధులు వస్తాయి. ఆ వ్యాధుల భారిన పడకుండా వర్షాన్ని ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉండాలి అంటే తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. మరి వర్షాకాలంలో తినాల్సిన ఆహరం ఏంటో ఎప్పుడు చూదాం.
Read also:Health tips: మినరల్ వాటర్ ని వంటకి వాడవచ్చా..? వాడితే ఎం అవుతుంది..?
అల్లం మరియు వెల్లుల్లి లో యాంటీ-వైరల్, యాంటీబయాటిక్ , యాంటీఆక్సిడెంట్, యాంటీమైక్రోబయల్/యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. అవి జ్వరం, గొంతు నొప్పి వంటి వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. మెంతి గింజలు/మేతి అనేది శక్తిని పెంచుతుంది వీటిని తీసుకోవడం వల్ల జ్వరం మరియు అజీర్తి నుండి ఉపశమనం లభిస్తుంది. ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పాలు మరియు పాల ఉత్పత్తులు, పప్పుదినుసులు , చికెన్ వంటివి ఆహారంగా తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.
Read also:Kakani Govardhan Reddy: సీఎం చెప్పిన మాట ప్రకారం.. సీజన్‌కు ముందే గిట్టుబాటు ధర: మంత్రి కాకాణి
పచ్చి కూరగాయలు తినకూడదు. ఆవరిపైన ఉడికించిన సలాడ్స్ తీసుకోవడం మంచిది. విటమిన్ ఎ మరియు సి, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగ లభించే దానిమ్మ, జామ, ఆపిల్, నారింజ వంటి పండ్లను తీసుకోవాలి. అలానే పచ్చిమిర్చి మరియు మిరియాలు ఆహారంలో ఉండేల చూసుకోవాలి. ఇందులో పైపెరిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇందులో గణనీయమైన మొత్తంలో విటమిన్లు సి మరియు కె ఉంటాయి. పచ్చి మిర్చి మరియు మిరియాలలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్‌ను క్రియారహితం చేయడం ద్వారా తీవ్రమైన వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయతించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.