Xi Jinping Vows To Turn China Military Into Great Wall Of Steel: దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం కోసం తమ బలగాలను ‘గ్రేట్ వాట్ ఆఫ్ స్టీల్’ (ఉక్కు సైన్యం)గా తీర్చిదిద్దుతామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ సోమవారం ప్రకటించారు. మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి ప్రసంగించిన జిన్‌పింగ్.. అమెరికాతో పాటు కొన్ని పొరుగు దేశాలతో పెరుగుతున్న ఉద్రిక్తల నేపథ్యంలో తమ సైన్యాన్ని ఉక్కు సైన్యంగా తయారుచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ వ్యవహారాలతోపాటు ప్రపంచ పాలనా వ్యవస్థ సంస్కరణలు, అభివృద్ధిలో తమ దేశం క్రియాశీల పాత్ర పోషిస్తోందని అన్నారు.
Goa Crime: దారుణం.. గోవా పర్యటనకు వెళ్లిన ఢిల్లీ ఫ్యామిలీపై కత్తులతో దాడి
తన నేతృత్వంలోని పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకత్వాన్ని నిలబెట్టాలని దేశానికి పిలుపునిచ్చారు. 2050 నాటికి చైనాను ఒక గొప్ప ఆధునిక సామ్యవాద దేశంగా నిర్మించేందుకు గాను.. జాతీయ పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనపై ఉందని దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘దేశాభివృద్ధికి భద్రతే ముఖ్య పునాది. సుసంపన్నతకు స్థిరత్వం చాలా అవసరం. ఇందులో భాగంగానే చైనా సాయుధ బలగాల ఆధునికీకరణ చేపడతాం. చైనా సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధిని రక్షించే శక్తిగా సైన్యాన్ని ‘గ్రేట్ వాల్ ఆఫ్ స్టీల్’గా మలుస్తాం. సరికొత్త భద్రతా విధానాలతో ముందుకెళ్తాం’’ అని చెప్పారు. ఇదే సమయంలో.. తైవాన్ వ్యవహారంలో ఇతర దేశాలు చేసుకుంటున్న జోక్యాన్ని, వేర్పాటువాద కార్యకలాపాలను చైనా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు.
Minister Abdul Sattar: రైతు ఆత్మహత్యలు కొత్తేమీ కాదు.. ‘మహా’మంత్రి సంచలన వ్యాఖ్యలు
కాగా.. గత వారంలో పార్లమెంట్ జిన్‌పింగ్‌ను అధ్యక్షుడిగా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ (CMC) అధిపతిగా, చైనా సైన్యానికి అధిపతిగా ఆమోదించింది. గతేడాది అక్టోబర్‌లో మూడోసారి సీపీసీ అధిపతిగా ఎన్నకైన జిన్‌పింగ్.. మావో తర్వాత రెండుసార్లు ఐదేళ్ల పదవీకాలాన్ని పొందిన ఏకైక నాయకుడిగా అవతరించాడు. గతవారం జిన్‌పింగ్ మాట్లాడుతూ.. ‘‘యునైటెడ్ స్టేట్స్ నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు.. చైనాను అన్ని రకాల నియంత్రణలు, అణచివేతను అమలు చేశాయి. ఇది దేశాభివృద్ధికి తీవ్రమైన సవాళ్లను తీసుకొచ్చింది’’ అని అన్నారు. భవిష్యత్తులో కష్టాలు, సవాళ్లు మరింత పెరుగతాయని పేర్కొన్నారు. మరోవైపు.. యుఎస్‌పై ఎక్కువ ఆధాపడకుండా ఉండేలా.. R&D వ్యయాన్ని 2023లో 328 బిలియన్ యువాన్లకు పెంచాలని చైనా ప్రభుత్వం ప్రతిపాదించింది.